Telugu News » Overseas House ful: యూఎస్ అడ్వాన్స్ బుకింగ్ ను షేక్ చేసిన సలార్..క్షణాల్లో టికెట్స్ మాయం!

Overseas House ful: యూఎస్ అడ్వాన్స్ బుకింగ్ ను షేక్ చేసిన సలార్..క్షణాల్లో టికెట్స్ మాయం!

ప్యాన్ ఇండియర్ స్టార్ హీరో ప్రభాస్ చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్ 'సలార్‌(Salar)'. కేజీఎఫ్ తోప్యాన్ ఇండియన్ డైరెక్టర్ అయిన ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

by sai krishna

ప్యాన్ ఇండియర్ స్టార్ హీరో ప్రభాస్ చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘సలార్‌(Salar)’. కేజీఎఫ్ తోప్యాన్ ఇండియన్ డైరెక్టర్ అయిన ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

 

ఈ క్రేజీ కాంబోలో వచ్చే మూవీ కోసం ఇటు అభిమానులు, ఇటు సినీ ప్రియులు కోరుకుంటున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ మంచి హైప్ క్రియేట్ చేయగాఅప్పుడప్పుడు ఈ మూవీ వైరల్ వార్తలతోనూ నెట్టింట ట్రెండ్ అవుతోంది.

లేటెస్ట్ టాక్ ఏంటంటే..ఈ సినిమా విడుదలకు నెల రోజుల ముందు నుంచే అమెరికాలో రికార్డు సృష్టిస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికాలో ‘సలార్‌’ టికెట్స్‌ అడ్వాన్స్‌ బుకింగ్‌(Advance booking) ప్రారంభమైంది.

బుకింగ్ స్టార్ట్ అయిన కొద్ది క్షణాల్లోనే ఈ టికెట్లు హాట్‌ కేకుల్లా అమ్ముడు అపోయాయట. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్టర్లు ట్విట్టర్‌లో తెగ ట్రెండ్ అవుతున్నాయి.

దీన్ని బట్టి చూస్తుంటే ఈ సినిమా ఓవర్సీస్‌ బాక్సాఫీస్‌(Box office)వద్ద మంచి సక్సెస్ను అందుకునేలా ఉందంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు శ్రుతి హాసన్, పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran),

జగపతి బాబు, మధు గురుస్వామి, ఈశ్వరీ రావు, శ్రీయా రెడ్డి, రామచంద్రరాజు, టీను ఆనంద్ లాంటి స్టార్స్ కీలక పాత్రలు పోషిస్తున్నందున ఈ సినిమా మరింత హైప్ పెంచేసింది

మరోవైపు ఈ సినిమా సెప్టెంబర్‌ 28న పాన్ ఇండియా లెవెల్లో విడుదలకానుంది. దీంతో సెప్టెంబర్‌ మొదటి వారం నుంచే మూవీ టీమ్ ప్రమోషన్స్ ప్రారంభించనున్నారట .ఈ క్రమంలో త్వరలోనే ఫస్ట్‌ సింగిల్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు కూడా చేస్తున్నారట.

హోంబలే ఫిలింస్‌(Hombale Films)విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా మొదటి భాగం షూటింగ్ పూర్తి చేసుకోగా.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.

You may also like

Leave a Comment