ప్రపంచ దేశాలను వెనక్కి నెడుతూ.. వేనోళ్ల కీర్తంపబడుతూ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అద్భుతం చేసింది. చంద్రయాన్ 3 ని సక్సెస్ ఫుల్ గా ప్రయోగించింది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా రోవర్ ప్రజ్ఞాన్ అడుగుపెట్టింది. ఈ విషయాన్ని ఇస్రో అధికారికంగా ప్రకటించింది. ప్రధాని మోడీ ఈ ప్రయోగాన్ని వర్చువల్ గా వీక్షించారు. ఈ సందర్భంగా ఇస్రో అధికారులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
చంద్రయాన్-3 విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ చేయడం చారిత్రాత్మకమని ప్రధాని మోడీ అన్నారు. ఈ క్షణం భారతదేశానికి చెందినది, ఇది ప్రజలకు చెందినది అని వ్యాఖ్యానించారు. ఈ విజయంతో తన జీవితం ధన్యమైందని తెలిపారు ప్రధాని. భారత్ సరికొత్త చరిత్ర సృష్టించిందని.. అమృత కాలంలో తొలి ఘన విజయమని అన్నారు. బ్రిక్స్ సమావేశాల్లో ఉన్నానని.. కానీ, తన మనసంతా చంద్రయాన్-3 పైనే ఉందని చెప్పారు.
చంద్రయాన్-3 బృందం, ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు ప్రధాని. ఈ క్షణం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూశానని.. ఈ విజయం దేశం గర్వించే మహత్తర క్షణాలని అన్నారు. ఈ అద్భుత విజయం కోసం 140 కోట్ల ప్రజలు ఎదురుచూశారని చెప్పారు. అంతకుముందు, ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ మాట్లాడుతూ.. భారతదేశం ఇప్పుడు చంద్రుని దక్షిణ ధృవం మీద ఉందని అన్నారు. మోడీ ప్రసంగం తర్వాత, ఈ ప్రయోగంలో పనిచేసిన వారి వివరాలను వెల్లడించారు సోమనాథ్.
ల్యాండర్ విక్రమ్ ప్రజ్ఞాన్ ను విజయవంతంగా చంద్రుడిపై దింపింది. సుమారు 40 రోజులపాటు ప్రయాణించి చంద్రుడిపై దిగింది ల్యాండర్. రోవర్ ప్రజ్ఞాన్ విక్రమ్ నుంచి వేరుపడి చంద్రుడిపై అడుగుపెట్టింది. 14 రోజులపాటు చంద్రుడి ఉపరితలాన్ని ఇది పరిశోధించనుంది. ఆ తర్వాత పరిస్థితి అనుకూలిస్తే మరో 14 రోజులు పనిచేస్తుంది.
Chandrayaan-3 Mission:
'India🇮🇳,
I reached my destination
and you too!'
: Chandrayaan-3Chandrayaan-3 has successfully
soft-landed on the moon 🌖!.Congratulations, India🇮🇳!#Chandrayaan_3#Ch3
— ISRO (@isro) August 23, 2023