Telugu News » Scholorships : మైనారిటీ స్కాలర్ షిప్పుల స్వాహా.. ఫేకుల రాజ్యంలో స్కాముల స్వాములు

Scholorships : మైనారిటీ స్కాలర్ షిప్పుల స్వాహా.. ఫేకుల రాజ్యంలో స్కాముల స్వాములు

by umakanth rao
minority schoolarship

 

Scholorships : అవినీతికి ఏదీ అతీతం కాదని ఈ స్టోరీ గురించి తెలుసుకున్న ఏ చిన్న పిల్లాడైనా చెబుతాడు. అందినకాడికి దోచుకుతింటున్న రాజ్యమిది.. అవినీతికి ఆజ్యం పోసే స్కాముల స్వాములున్న కాలమిది.. అని ఎలుగెత్తి చాటుతాడు. మైనారిటీ పిల్లలకు ఉద్దేశించిన స్కాలర్ షిప్పుల భోక్తల కథ విని బోలెడంత ఆశ్చర్యపడిపోతాడు. పిల్లల నోట్లో మట్టి కొట్టే స్వాహా స్వాములు ఎక్కడ నక్కారో గానీ అంతా గప్ చుప్ ! నాడు యూపీఏ హయాంలో వెలగబెట్టిన పథకం కాస్తా పక్కదారి పట్టి సొమ్మంతా ఫేక్ వీరుల జేబుల్లోకి వెళ్ళిపోయింది. కథ ఎక్కడ, ఎలా మొదలు పెట్టినా చివరకు వేలకోట్ల కుంభకోణం వద్దకే చేరుతుంది. నకిలీ సంస్థలు, నకిలీ డాక్యుమెంట్లతో బురిడీ కొట్టించి ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టించిన ఛీటర్లున్న రాజ్యంలో ఎక్కడ ఎలా మొదలు పెట్టాలో తెలియకుండా పోయింది.830 Of 1,572 Minority Institutions Getting Govt. Scholarship Fake - Nagaland Page

 

ఇక అసలు విషయానికి వస్తే మైనారిటీ స్కాలర్ షిప్ ప్రోగ్రాం కింద నాడు ..2007 లో ఆ నాటి ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా చేబట్టింది. కానీ ఎప్పుడు అవినీతికి ఎవరు, ఎలా బీజం వేశారో గానీ దాదాపు 830 మైనారిటీ సంస్ధలు .. అంటే సుమారు 53 శాతం సంస్థలు ఈ స్కాలర్ షిప్పులను ‘పక్కదారి పట్టించాయి.’ 18 ఏళ్లకు గానీ ఈ చీటింగ్ బయటపడలేదు. ఇది దాదాపు రూ. 144 .83 కోట్ల కుంభకోణమని తెలిసి మైనారిటీ వ్యవహారాలశాఖ ఖంగు తింది . ఈ యవ్వారం బయట పడడంతో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ దీనిపై సిబిఐ ఇన్వెస్టిగేషన్ కి ఆదేశించారు. మైనారిటీల శాఖ గత జులై 10 న అధికారులకు ఫిర్యాదు చేసింది. దేశశంలోని 34 రాష్ట్రాల్లోని 100 జిల్లాల్లో 1572 సంస్ధలను స్క్రూటినీ చేస్తూపోతే అవినీతి భూతం వికటాట్టహాసం చేస్తూ కనిపించింది.

నకిలీ గాళ్ళు బ్యాంకుల్లో ఖాతాలు తెరిస్తే వాటిని అధికారులు స్తంభింపజేశారు. ఇక వీటిలో పలు సంస్థలు నేషనల్ స్కాలర్ షిప్ పోర్టల్, యునిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్ కింద రిజిస్టర్ చేయించుకున్నాయి. కానీ దేవతా వస్త్రాల్లాగా అసలు వీటి ఉనికే లేదని, ఉన్నా అవి పని చేయడం లేదని తెలిసింది. ఈ సంస్ధల నోడల్ ఆఫీసర్లను, ఇతర అధికారులను ఇన్వెస్టిగేట్ చేసే పనిలో పడింది సిబిఐ. వీరితో బాటు జిల్లాల్లోని నోడల్ ఆఫీసర్లు కూడా చేసిన వెరిఫైడ్ కేసులు కూడా ఫేక్ అని తేలింది. ఆరా తీస్తే ఛత్తీస్ గఢ్ లో 62 సంస్ధలు, రాజస్థాన్ లో 99, అసోంలో 68 సంస్థలు వట్టి బోగస్ అని కూడా తెలిసింది. కర్ణాటకలో 64, యూపీలో 44, బెంగాల్ లో 39 సంస్థలు అసలు ఉన్నాయో, లేవో కూడా తెలియలేదు. మొత్తానికి మైనారిటీ విద్యార్థుల స్కాలర్ షిప్ ల పేరిట కోట్ల కొద్దీ సొమ్మును తిలా పాపం తలా అన్నట్టు దోచుకు తిన్నారు . రాజకీయ నాయకుల నుంచి బడా బాబులు, చివరకు బ్యాంకర్లు కూడా ఈ దోపిడీలో భాగస్వాములయ్యారు. సీబీఐ దర్యాప్తు మరిన్ని జిల్లాలకు విస్తరిస్తే ఇంకెన్ని కోట్లను స్వాహా చేశారో తెలుస్తుంది. అర్హత లేకున్నా స్కాలర్ షిప్.. బ్యాంకులు సైతం ఫేక్ డాక్యుమెంట్లు ఇచ్చినవారికి కూడా ఖాతాలు తెరిచి తమ ‘ఉదారతను’ చాటుకున్నాయి.

కేరళలోని మలప్పురం లో ఓ బ్యాంక్ 67 వేల స్కాలర్ షిప్పులను మంజూరు చేసిందట. పిల్లల నోట్లో మట్టి కొట్టి లబ్ది దారులకు ప్రయోజనం కలిగించాయి బ్యాంకులు.

You may also like

Leave a Comment