ఫిడే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ విజేత ఎవరో తేల్చేస్తుంది అనుకుంటే..మరో ఉత్కంఠకు తెరతీసింది. భారత చెస్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద (Pragnananda),నార్వేజియన్ గ్రాండ్ మాస్టర్ మాగ్నస్ కార్లెస్(Magnus Carlles)హోరా హోరీగా తలపడి ఫైనల్ కథను మళ్లీ మొదటికి తెచ్చారు.
దీంతో విజేత ఎవరనేది గురువారం నిర్ణయించనున్నట్లు అంతర్జాంతీయ చెస్ ఫెడరేషన్(International Chess Federation)పేర్కొంది. ఇది వరకు జరిగిన మ్యాచ్ లో కూడా ఇద్దరు ధీటుగానే తలపడ్డారు. మ్యాచ్ డ్రా అవడంతో రెండో క్లాసికల్ మ్యాచ్ కోసం ఉత్కంఠగా ఎదరు చూశారు. కాగా ఇది కూడా డ్రాగా ముగిసింది.
మాగ్నస్ తొలి మ్యాచ్ లో బ్లాక్ సైడ్ తలపడగా నేడు వైట్ సైడ్ ఆడాడు.అయితే అంతకుముందు జరిగిన సెమీఫైనల్ తొలి గేమ్‌లో భారత్కు చెందిన ప్రజ్ఞానంద, అమెరికాకు చెందిన ఫాబియానో కరువానా(Fabiano Caruana)తో డ్రా చేసుకున్నాడు.
ఈ క్రమంలో రెండవ గేమ్ను కూడా ఫాబియానో కరువానా డ్రా చేసుకోగలిగాడు. అందువల్ల ఫలితాన్ని నిర్ణయించడానికి టై బ్రేకర్(tie breaker)ను ఆశ్రయించాల్సి వచ్చింది. ఇక సోమవారం జరిగిన టై బ్రేకర్ గేమ్‌లో ప్రపంచ నంబర్ 3 చెస్ ప్లేయర్ ఫాబియానో కరువానా.. ప్రజ్ఞానందపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించాడు.
అయినప్పటికీ.. తన నిర్ణయాత్మక ఎత్తుగడలతో ప్రజ్ఞానంద.. గేమ్పై పట్టు సాధించి డ్రా దిశగా తీసుకెళ్లగలిగాడు. అలా 2వ టైబ్రేకర్ గేమ్‌లోనూ ప్రజ్ఞానంద ఫాబియానో కరువానాను గెలవకుండా అడ్డుకున్నాడు.
దీంతో మ్యాచ్ 10+10 టైబ్రేక్‌కు వెళ్లింది. ఆ తర్వాత జరిగిన మొదటి ర్యాపిడ్ టైబ్రేక్‌ను ప్రజ్ఞానంద గెలుచుకోవడం ద్వారా ఫాబియానోపై ఒత్తిడి తెచ్చాడు. ఆఖరికి ప్రజ్ఞానంద 3.5-2.5తో ఫాబియానో కరువానాపై అద్భుత విజయం సాధించి ఫైనల్స్కు చేరుకున్నాడు.
ఈ విజయంతో 2024 క్యాండిడేట్ టోర్నీలో ప్రజ్ఞానంద చోటు ఖాయం చేసుకున్నాడు. బాబి ఫిషర్, కార్ల్‌సన్ తర్వాత ఆ పోటీల్లో తలపడే మూడో పిన్న వయస్సు ఆటగాడిగా నిలిచాడు.
ఇక ప్రజ్ఞానంద కెరీర్ విషయానికి వస్తే.. దేశంలోనే అత్యంత ప్రతిభావంతులైన చెస్ ఆటగాడిగా పేరొందిన ప్రజ్ఞానంద.. 10 సంవత్సరాల వయసులోనే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు.
ఇక రెండేళ్లలోనే ప్రజ్ఞానంద గ్రాండ్ మాస్టర్గా రాణించాడు విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రపంచకప్ ఫైనల్స్కు చేరిన రెండో భారతీయ ఆటగాడిగా ప్రజ్ఞానంద చరిత్రకెక్కాడు.