Telugu News » Elections: రెండు రాష్ట్రాల్లో మొదలైన పోలింగ్….!

Elections: రెండు రాష్ట్రాల్లో మొదలైన పోలింగ్….!

ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మిజోరాం సీఎం జోరంతంగా తన ఓటుహక్కును వినియోగించుకున్నారు.

by Ramu

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో (Elections) భాగంగా ఈ రోజు చత్తీస్‌గఢ్ (Chhattisgarh), మిజోరాం (Mizoram)లలో పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఉదయం 7 గంటలకే రెండు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రారంభం అయింది. ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మిజోరాం సీఎం జోరంతంగా తన ఓటుహక్కును వినియోగించుకున్నారు.

చత్తీస్ గఢ్‌లో మొత్తం 90 నియోజకవర్గాలు ఉండగా మొదటి విడత ఎన్నికల్లో భాగంగా 20 నియోజక వర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. వాటిలో 12 అసెంబ్లీ స్థానాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయి. దీంతో పోలింగ్ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో పోలీసులు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

చత్తీస్ గఢ్‌లో మొదటి దశ ఎన్నికల్లో 5,304 పోలింగ్ స్టేషన్లలో 40 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొదటి విడత ఎన్నికల్లో మొత్తం 223 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వారిలో 25 మంది మహిళ అభ్యర్థులు ఉన్నారు. నక్సల్స్ ప్రభావిత బస్తర్ డివిజన్‌ల్లోని 600 పోలింగ్ స్టేషన్లలో మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు.

చత్తీస్‌గఢ్‌లోని సుక్మాలోని తొండ మార్క ప్రాంతంలో మావోయిస్టులు జరిపిన దాడుల్లో కోబ్రా బెటాలియన్ కు చెందిన జవాన్ గాయపడ్డారు. ఈ రోజు చత్తీస్ గఢ్ ప్రజాస్వామ్యంలో అతి పవిత్రమైన పండుగ అని ప్రధాని మోడీ అన్నారు. ఈ ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధాని కోరారు.

 

You may also like

Leave a Comment