Telugu News » China Companies : భారత్‌కు షాకిచ్చిన రెండు దిగ్గజ కంపెనీలు.. అమ్మకాలు నిలిపివేస్తున్నట్టు వెల్లడి..!!

China Companies : భారత్‌కు షాకిచ్చిన రెండు దిగ్గజ కంపెనీలు.. అమ్మకాలు నిలిపివేస్తున్నట్టు వెల్లడి..!!

టెలివిజన్ రంగంలో ఎల్​జీ, శామ్​సంగ్​, సోనీ, పానాసోనిక్​ వంటి కంపెనీలు భారత్​లో రాణించాయి. షావోమీ, టీసీఎల్, వన్​ప్లస్​, రియల్​మీ​ వంటి కంపెనీలు కూడా తమ వ్యాపారాన్ని విస్తరించి అమ్మకాల్లో మెరుగైన ఫలితాలు సాధించాయి. కానీ భారత్​లో చైనా కంపెనీలపై పెరుగుతున్న ఒత్తిడి నేపథ్యంలో అమ్మకాలు నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్టు చైనా వ్యాపార వర్గాలు తెలిపాయి.

by Venu

చేతిలో తక్కువ బడ్జెట్ పట్టుకొని స్మార్ట్ టీవీ కొందామని మార్కెట్ వెళ్ళే వారికి చైనా (China) షాకిచ్చింది. భారీ ఆఫర్లతో మధ్యతరగతి ప్రజలను ఆకట్టుకొనే రెండు చైనా దిగ్గజ కంపెనీలు తమ వ్యాపారాలను భారత్ (Bharat)​లో నిలిపివేస్తున్నట్టు ప్రకటించాయి.. భారత్​లో టీవీ (TV)ల ఉత్పత్తి, అమ్మకాలను నిలిపివేయాలని ప్రముఖ ఎలక్ట్రానిక్, మొబైల్ దిగ్గజ కంపెనీలు వన్​ప్లస్ (OnePlus) రియల్​మీ ( Realme) కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి.

అయితే స్మార్ట్​ఫోన్ల విభాగంలో వన్​ప్లస్​, రియల్​మీ కంపెనీలు తమ వ్యాపారాన్ని కొనసాగిస్తాయని తెలుస్తోంది. పలు సంస్థలు అందించిన నివేదికల ప్రకారం.. ఈ రెండు కంపెనీలు చైనాలో ఇతర కంపెనీలకు చెక్‌ పెట్టేలా కార్యకలాపాలపై దృష్టిసారించినట్టు వెల్లడించాయి. ఇందులో భాగంగా భారత్‌లో టీవీ తయారీ, అమ్మకాల్ని నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్టు వన్​ప్లస్​, రియల్​మీ కంపెనీలు తెలిపాయి..

ఇప్పటికి వన్‌ప్లస్‌, రియల్‌మీలు చైనాలో మార్కెట్‌ పరంగా ఇతర కంపెనీల కంటే ముందంజలో ఉండటం గమనార్హం. మరోవైపు వన్​ప్లస్​, రియల్​మీ కంపెనీలు టీవీల అమ్మకాల్లో భారీ ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. పండగల సమయాల్లో డిస్కౌంట్లు, భారీ ఆఫర్లు ఇచ్చి, తక్కువ ధరలకే వినియోగదారులకు టీవీలను అందించడం వల్ల వీటికి ప్రజల్లో ఆదరణ ఎక్కువైంది..

మరోవైపు టెలివిజన్ రంగంలో ఎల్​జీ, శామ్​సంగ్​, సోనీ, పానాసోనిక్​ వంటి కంపెనీలు భారత్​లో రాణించాయి. షావోమీ, టీసీఎల్, వన్​ప్లస్​, రియల్​మీ​ వంటి కంపెనీలు కూడా తమ వ్యాపారాన్ని విస్తరించి అమ్మకాల్లో మెరుగైన ఫలితాలు సాధించాయి. కానీ భారత్​లో చైనా కంపెనీలపై పెరుగుతున్న ఒత్తిడి నేపథ్యంలో అమ్మకాలు నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్టు చైనా వ్యాపార వర్గాలు తెలిపాయి.

You may also like

Leave a Comment