Telugu News » Asian Games 2023: ఆసియా గేమ్స్ లో…చైనా పొలిటికల్ గేమ్స్ !

Asian Games 2023: ఆసియా గేమ్స్ లో…చైనా పొలిటికల్ గేమ్స్ !

ఆసియా గేమ్స్‌లో అరుణాచల్ ప్రదేశ్‌ ఆటగాళ్లకు ప్రవేశాన్ని చైనా నిరాకరించడంపై భారత్ మండిపడింది. ఈ నేపధ్యంలో చైనా వెళ్లాల్సిన కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖామంత్రి అనురాగ్ ఠాగూర్ తన చైనా పర్యటనను రద్దు చేసుకున్నారు.

by Prasanna
arunachal pradesh

అరుణచల్ ప్రదేశ్ విషయంలో భారత్ ను ఇబ్బంది పెట్టేందుకు చైనా ఆసియా గేమ్స్ (Asia Games) వేదికను వాడుకుంది. వుషు (wushu)  టీంకు చెందిన ముగ్గురు అరుణచల్ ప్రదేశ్ (Arunachal Pradesh) క్రీడాకారులను వెనక్కి పంపింది.  చైనాలోని హాంగ్‌జౌలో జరుగుతున్న 19వ ఆసియా క్రీడలకు అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ముగ్గురు భారత వుషు (wushu) ఆటగాళ్ల ప్రవేశాన్ని డ్రాగన్‌ కంట్రీ రద్దు చేసింది. వారి వీసాలను, అక్రిడేషన్‌ను రద్దు చేసింది.

arunachal pradesh

ఆసియా గేమ్స్‌లో అరుణాచల్ ప్రదేశ్‌ ఆటగాళ్లకు ప్రవేశాన్ని చైనా నిరాకరించడంపై భారత్ మండిపడింది. ఈ నేపధ్యంలో చైనా వెళ్లాల్సిన కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖామంత్రి అనురాగ్ ఠాగూర్ తన చైనా పర్యటనను రద్దు చేసుకున్నారు. ఆటగాళ్లను రాకుండా ఆపడం ఆసియా గేమ్స్ నిబంధనలకు వ్యతిరేకమని మండిపడ్డారు. అరుణాచల్ ప్రదేశ్ భారత్‌లో భాగమని స్పష్టం చేశారు అనురాగ్ ఠాకూర్. చైనా కవ్వింపు చర్యలను ఖండించారు. ఇదే విషయంపై భారత విదేశాంగ శాఖ చైనా తీరు తప్పుబట్టింది.

భారత్ ను ఇబ్బంది పెట్టె విధంగా డ్రాగన్ కంట్రీ కి ఏ మాత్రం చిన్న అవకాశం దొరికినా వదిలి పెట్టదనే విషయం తెలిసిందే. భారత్ ను ఇబ్బంది పెట్టడానికి సరిహద్దు ప్రాంతం దగ్గర మాత్రమే కాకుండా, ఈశాన్య ప్రాంతాల్లోని పలు చోట్ల చైనా తన దేశ విస్తరణ కాంక్షను వెల్లడిస్తునే ఉంది. ఆసియా గేమ్స్ మాటున కూడా చైనా భారత్ ను రెచ్చగెట్టే ప్రయత్నాలు చేస్తుందని రక్షణ రంగ నిపుణులు అంటున్నారు. భారత్‌ వుషు టీంకు చెందిన ముగ్గురు అరుణాచల్‌ ప్రదేశ్‌ ప్లేయర్స్‌ను వెనక్కి పంపి, అరుణాచల్‌ ప్రదేశ్‌ తమ భూబాగంలో అంతర్భాగమంటూ చెప్పే ప్రయత్నం చేస్తుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

భారత విదేశాంగ శాఖ చైనా తీరు తప్పుబట్టింది. ప్రాంతీయత ఆధారంగా ఆటగాళ్ల ప్రవేశాన్ని రద్దు చేయడమేంటని మండిపడింది. వివక్షను భారత్ అంగీకరించబోదని స్పష్టం చేసింది. భారత్‌లో భాగమైన అరుణాచల్ ప్రదేశ్‌లోని ఆటగాళ్ల ప్రవేశాన్ని చైనా రద్దు చేయడం ఆసియా గేమ్స్ నిబంధనలకు విరుద్ధమని తెలిపింది. చైనా తీరుపై చర్యలు తీసుకుంటామని తెలిపింది. వివక్షకు గురైన భారత ఆటగాళ్లను ఢిల్లీకి తీసుకువచ్చింది. మరోవైపు ఇదే విషయంపై ఆసియా గేమ్స్‌ను నిర్వహించే అత్యున్నత కమిటీ స్పందించింది. ఈ ఘటనను ఆసియా ఒలింపిక్ కమిటీకి తీసుకువెళ్లినట్లు తెలిపింది.

 

You may also like

Leave a Comment