సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మానవత్వం చాటుకున్నారు. ప్రమాదవశాత్తు మరణించిన స్విగ్గీ డెలివరీ బాయ్ (Delivary Boy) కుటుంబానికి సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక సహాయం చేశారు. స్విగ్గీ డెలివరి బాయ్ కుటుంబానికి రూ. 2 లక్షల ఆర్థిక సహాయాన్ని సీఎం అందించారు. ముఖ్య మంత్రి సహాయనిధి నుంచి ఈ చెక్కును సీఎం అందజేశారు.
నాలుగు నెలల క్రితం హైదరాబాద్‌లో కస్టమర్‌కు ఆర్డర్ డెలివరీ చేసేందుకు సిగ్గీ డెలివరి బాయ్ రిజ్వాన్ ఓ అపార్డ్ మెంట్ లోకి వెళ్లాడు. అక్కడ ఉన్న కుక్క వెంటనే రిజ్వాన్ పైకి ఉరికి వచ్చింది. కుక్క నుంచి తప్పించుకునే ప్రయత్నంలో భవనంపై నుంచి పడిపోయాడు. దీంతో చికిత్స పొందుతు మరణించాడు. ఇటీవల ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో గిగ్ వర్కర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కాగా ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది.
ఈ క్రమంలో రిజ్వాన్ కుటుంబం వివరాలు సేకరించి వారికి ఆర్థిక సహాయం చేయాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. తాజాగా ఈ రోజు ఆ కుటుంబానికి సచివాలయంలో ఆర్థిక సహాయాన్ని అందజేశారు. మరోవైపు తెలంగాణ ఉద్యమంలో డీఎస్పీ ఉద్యమానికి రాజీనామా చేసిన నళిని ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. నళినికి తిరిగి ఉద్యోగ్యం కల్పించడంలో ఏమైనా అడ్డంకులు ఉన్నాయా అని పోలీసు అధికారులను ఆయన ఇటీవల ఆరా తీశారు.
తిరిగి ఉద్యోగంలో చేరేందుకు నళిని తిరస్కరించారు. తనను కలిసేందుకు నళినికి అవకాశం ఇవ్వాలంటూ ఇటీవల రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డిని ఆమె కలిశారు. రేవంత్ రెడ్డిని కలవడం తనకు ఆనందంగా ఉందని నళిని అన్నారు. కానీ ఇప్పుడు తనకు ఉద్యోగం అవసరం లేదన్నారు. తాను డబ్బు, భౌతిక ప్రపంచం నుంచి బయటపడ్డానన్నారు.