పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి (Telangana Cm Revanth Reddy) ఢిల్లీ పోలీసులు(Delhi police NOtice) సమన్లు పంపించిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా(T Congress Social Media) విభాగంలోని పలువురికి కూడా ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారు.
ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. రాష్ట్రంలో పర్యటించిన టైంలో ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడిన మాటలను కాంగ్రెస్ సోషల్ మీడియా వింగ్ రీమేక్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేసిన విషయం తెలిసిందే. అవి కాస్త వైరల్ అవడంతో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
వెంటనే స్పందించిన ఢిల్లీ పోలీసు విభాగంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా వింగ్ లోని కీలకమైన వ్యక్తులకు నోటీసులు ఇచ్చింది. వారిని విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. తాజాగా ఈ ఘటనపై నిజామాబాద్ ఎంపీ అర్వింద్ స్పందించారు.
మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి హుందాగా ప్రవర్తించాలన్నారు. హోంమంత్రి వీడియాలను మార్ఫింగ్ చేస్తే ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. అమిత్ షా ఫేక్ వీడియాల కేసులో నోటీసులు రాగానే రేవంత్ రెడ్డి మాయం అయ్యారని ఎంపీ అర్వింద్ ఎద్దేవా చేశారు. మోడీని బడే భాయ్ అన్నందుకు రేవంత్ పై రాహుల్ గాంధీ కక్ష కట్టారన్నారు. సీఎం రేవంత్‌ను జైలుకు పంపాలని చుట్టుపక్కనే వాళ్లే చూస్తున్నారని సంచలన కామెంట్స్ చేశారు.ఇక మీదట రేవంత్ రెడ్డి జాగ్రత్తగా ఉండాలని అర్వింద్ సూచించారు.