సీఎం వైఎస్ జగన్ (YS Jagan) సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు (Chandra Babu) జైల్లో ఉన్నా బయట వున్నా పెద్ద తేడా లేదని అన్నారు. గజ దొంగల ముఠా వీరప్పన్ (Veerappan) చంద్రబాబును సమర్థించడం అంటే పేదవాళ్లను వ్యతిరేకించడమేనన్నారు. చంద్రబాబును సమర్థించడమంటే నయా భూ స్వామ్య వ్యవస్థను సమర్థించడమేని మండిపడ్డారు.
చంద్రబాబు పేరు చెప్గానే వెన్నుపోటు, మోసాలు, అబద్దాలు, వంచనలు గుర్తుకు వస్తాయంటూ ఎద్దేవా చేశారు. తనను చూస్తే సామాజిక న్యాయం, గ్రామాల్లో మారిన వైద్యం, విద్యా, ప్రాంతాల మధ్య సమానత్వం, మహిళలకు భద్రత, దిశా యాప్ ద్వారా 30 వేల మందిని కాపాడడం వంటివి గుర్తుకు వస్తాయని చెప్పారు.. చంద్రబాబు అరెస్టు కక్ష సాధింపు చర్య కాదన్నారు.
తనకు చంద్రబాబుపై ఎలాంటి కక్ష లేదని స్పష్టం చేశారు. తాను లండన్‌లో ఉన్న సమయంలో చంద్రబాబును పోలీసులు అరెస్టు చేశారని జగన్ గుర్తు చేశారు. అవినీతి, అక్రమాలకు పాల్పడటం వల్లే చంద్రబాబు అరెస్టయ్యారని వివరించారు. చంద్రబాబు అవినీతిని పసిగట్టి సీబీఐ, ఈడీ, జీఎస్టీ రంగంలోకి దిగాయన్నారు. అందుకే చంద్రబాబు రాష్ట్రంలో సీబీఐని అడుగు పెట్టనివ్వను అని తీర్మానం చేశాడని మండిపడ్డారు.
కేంద్రంలో బీజేపీ అధిారంలో వుందన్నారు. దత్త పుత్రుడు (పవన్ కల్యాణ్) కాషాయ పార్టీతోనే వున్నానని చెబుతున్నాడని పేర్కొన్నారు. రాష్ట్ర బీజేపీలో అధ్యక్షురాలితో పాటు సగం మంది బీజేపీ నేతలు టీడీపీ వాళ్లేనన్నారు. ఏపీ స్కిల్ కుంభకోణంలో చంద్రబాబు అరెస్టు అయ్యారు. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్నారు.