అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump)కు కొలరెడో సుప్రీం కోర్టు ( Colorado Supreme Court)షాక్ ఇచ్చింది. ట్రంప్‌పై సుప్రీం కోర్టు అనర్హత వేటు వేసింది. వచ్చే ఏడాది అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా జరగనున్న కొలరెడో ప్రెసిడెన్షియల్ బ్యాలెట్‌లో పోటీ చేయకుండా ట్రంప్ పై అనర్హత వేటు వేసింది. 2021లో వాషింగ్టన్ క్యాపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారులు దాడి చేసిన కేసుకు సంబంధించి కోర్టు ఈ మేరకు తీర్పు వెల్లడించింది.
దేశంలో తిరుగుబాటు చర్యలకు పాల్పడే వారిని రాజ్యాంగ పదవిలో కొనసాగకుండా చర్యలు తీసుకునే నిబంధనలు రాజ్యాంగంలో ఉన్నాయి. ఈ నిబంధన ప్రకారం అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయకుండా అనర్హుడిగా వేటుపడిగా మొదటి వ్యక్తి డోనాల్డ్ ట్రంప్ కావడం గమనార్హం. మరోవైపు ఈ కేసులో అప్పీల్ చేసుకునేందుకు ట్రంప్ కు న్యాయస్థానం అవకాశం కల్పించింది.
2021 అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ ట్రంప్ మద్దతుదారులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ట్రంప్ ఓటమికి ఎన్నికల సంఘానిదే బాధ్యత అంటూ వాష్టింగన్‌లో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఈ క్రమంలో యూఎస్ పార్లమెంట్ భవనంపై ట్రంప్ మద్దతుదారులు దాడి చేశారు. భవనంలోకి చొరబడి విధ్వంసం సృష్టించారు.
ఈ ఘటనపై సిటిజన్స్ ఫర్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఎథిక్స్ గ్రూప్ కోర్టును ఆశ్రయించింది. ట్రంప్ ను డిస్ క్వాలిఫైగా ప్రకటించాలంటూ కోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఈ ఘటనకు కారకుడిగా ట్రంప్ ను కోర్టు గుర్తించింది. ఈ మేరకు తీర్పు వెల్లడించింది. ఈ తీర్పు కేవలం కొలరెడోకు మాత్రమే వర్తిస్తుంది. కేవలం ఈ స్టేట్‌లో జరిగే పోస్టల్ బ్యాలెట్ లో మాత్రమే ట్రంప్ పేరు కనిపించదు. మిగతా రాష్ట్రాలకు ఈ తీర్పు వర్తించదని న్యాయస్థానం వెల్లడించింది.