దేశంలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 60 కోట్ల మంది ఓటు (Vote) హక్కును వినియోగించుకున్నారని ప్రధాని మోడీ (PM Modi) తెలిపారు. ఆ రికార్డులను తిరగరాస్తూ వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో 100 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని ప్రధాని వెల్లడించారు. ప్రపంచంలోనే ఇవి అతి పెద్ద ఎన్నికలన్నారు. ఈ అద్బుతాన్ని పరిశీలించేందుకు భారత్ కు రావాలని పీ-20 ప్రతినిధులను కోరారు.
ఢిల్లీలో జరుగుతున్న జీ20 పార్లమెంటరీ స్పీకర్స్ సమావేశంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…..దేశంలో 25 ఏండ్లుగా ఈవీఎంలను ఉఫయోగిస్తున్నారని చెప్పారు. ఈవీఎంల వల్ల ఎన్నికల్లో పారదర్శకత పెరిగిందన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ప్పటి నుంచి ఇప్పటి వరకు 17 సాధారణ ఎన్నికలు, 300 అసెంబ్లీ ఎన్నికలు జరిగాయన్నారు.
2019 సాధారణ ఎన్నికల్లో దేశంలో అత్యధికంగా 60 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని పేర్కొన్నారు. దేశ జనాభాలో 70 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని వెల్లడించారు. ఇది దేశంలో పార్లమెంటరీ విధానంపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని ప్రతిబింబించిందన్నారు. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో 100 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారన్నారు.
ఇజ్రాయెల్- హమాస్ యుద్ధం గురించి ప్రస్తావిస్తూ….. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న సంఘర్షణలు ఎవరికీ లబ్ది చేకూర్చయని అన్నారు. మానవత్వం ఎదుర్కొంటున్న సవాళ్లను విభజనకు గురైన ప్రపంచం ఎప్పుడూ పరిష్కరించలేదన్నారు. ఇది శాంతి, సోదరభావానికి సమయమన్నారు. ఇప్పుడు మనమంతా కలిసి కదలాల్సిన సమయమన్నారు. ఇది మనందరి అభివృద్ధి, సంక్షేమానికి సమయమన్నారు. దశాబ్దాలుగా భారత్ సరిహద్దు ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటోంద్నారు