రూ. 200 కోట్ల మనీలాండరింగ్ ( Money Laundering Case)కేసులో జైలు శిక్ష అనుభవిస్తన్న సుఖేశ్ చంద్రశేఖర్ (Sukesh Chandrashekhar) బాలీవుడ్ ముద్దుగుమ్మ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ (Jacqueline Fernandez)ను బెదిరిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. జాక్వెలిన్ తనను మోసం చేసిందని, ఇప్పుడు తనను దయ్యంలాగా చూస్తోందని సుఖేశ్ ఓ లేఖలో పేర్కొన్నాడు.
తాను ఎవరినైతే భద్రంగా చూసుకున్నానో ఆ వ్యక్తి తనకు ఇప్పుడు ఎదురు తిరిగుతోందని చెప్పారు. బాధితులుగా చెప్పుకుంటూ నిందలు వేయడం మొదలు పెట్టారని అన్నారు. తనపై కోర్టులో కేసులు వేసేందుకు ప్రయత్నాలు చేస్తోందని అన్నాడు. ఆ వ్యక్తిని రక్షించేందుకు ఇన్నాళ్లుగా వాస్తవాలను దాచి పెట్టానన్నాడు. కానీ ఇకపై అలా చేయడంలో లాభం లేదన్నారు.
ఒక వేళ తనపై కోర్టులో కేసులు వేస్తే జాక్వెలిన్ ను విడిచి పెట్టే ప్రసక్తే లేదని చెబుతున్నాడు. ఆమె గుట్టు రట్టు చేస్తానని హెచ్చరించాడు. దయ్యం అంటే ఏంటో ఆమెకు చూపిస్తానని తెలిపాడు. జాక్వెలిన్‌కు తాను చేసిన చాటింగ్ కు సంబంధించిన స్క్రీన్ షాట్స్, తమ సంభాషణల రికార్డింగ్స్ ను దర్యాప్తు సంస్థలకు, న్యాయస్థానానికి అందిస్తానని వెల్లడించాడు.
ఈ నేపథ్యంలో బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాడేంజ్ ఢిల్లీలోని పాటియాలా కోర్టును ఆశ్రయించింది. లెటర్లు, స్క్రీన్ షాట్స్ అంటూ తనను సుఖేశ్ మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నాడని కోర్టులో వెల్లడించారు. అందువల్ల తనకు సంబంధించి సుఖేశ్ మరే ఇతర లెటర్లు, మెసేజ్ లు, స్టేట్ మెంట్స్ విడుదల చేయకుండా చూడాలని న్యాయస్థానాన్ని కోరారు.
ఈ మేరకు మండోలీ జైలు సూపరింటెండెంట్ కు, ఢిల్లీ పోలీసు విభాగం ఎకనామిక్ వింగ్ కు ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో జాక్వెలిన్‌ను ఇప్పటికే ఈడీ పలుమార్లు ప్రశ్నించింది. నిందితుడు సుఖేశ్ చంద్రశేఖర్ నుంచి తనకు విలువైన బహుమతులు అందిన మాటిన వాస్తవమేనని తెలిపారు. కానీ అతని అక్రమ సంపాదన గురించి తెలియదని స్పష్టం చేసింది.