మేడిపల్లి (Medipally) పోలీసు స్టేషన్ ఎదుట మహిళా కానిస్టేబుల్ ఆందోళనకు దిగారు. మేడిపల్లి ఎస్ఐ శివకుమార్ (Shiva Kumar) తమపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఓ భూ తగాదా విషయంలో తన భర్త వరుణ్ పై తప్పుడు ఎంఎల్సీ సర్టిఫికెట్తో రిమాండ్కు తరలించే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు.
గతంలో ఎస్సై శివకుమార్ పై తాను సీపీకి ఫిర్యాదు చేశానని వివరించారు. ఈ క్రమంలో తపై ఎస్పై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నాడన్నారు. ఎస్సై ఏక్షపక్షంగా వ్యవహరిస్తూ కబ్జాదారులకు సహకరిస్తున్నారని, ఎలాంటి దర్యాప్తు చేయకుండానే కేసులు నమోదు చేస్తున్నారంటూ ఆమె వెల్లడించారు.
తమ పిటిషన్ను పరిశీలించకుండానే తమపై ఎస్సై తప్పుడు కేసులు పెడుతున్నారని… రిమాండ్ కు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఎస్సై శివకుమార్ అవినీతికి సంబంధించి తన దగ్గర స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని చెప్పారు. దీనిపై విచారణ చేపట్టాలని కోరారు.
పోలీసు శాఖలో పని చేసే తనకే న్యాయం జరగకపోతే ఇక సామాన్యులకు ఎలా న్యాయం చేస్తారంటూ నాగమణి ప్రశ్నించారు. ఈ విషయంలో ఉన్నాతాధికారులు సమగ్ర విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు. తమకు న్యాయం చేయాలంటూ ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు.