– వివాదాస్పదంగా కేటీఆర్ వ్యాఖ్యలు
– కేసీఆర్ గెలిస్తేనే అజాన్ వినపడుతుందట
– ఇది ముస్లింలను రెచ్చగొట్టడం కాదా?
– ఓట్ల కోసం మరీ ఇంత దిగజారాలా?
– కాబోయే సీఎం మాట్లాడే మాటలేనా?
– బీజేపీ, హిందూ సంఘాల ప్రశ్న
రాజకీయ నాయకుడంటే ఆలోచించి మాట్లాడాలి. హుందాగా వ్యవహరించాలి. లేదంటే.. చివాట్లు తప్పవు. ప్రస్తుతం మంత్రి కేటీఆర్ (KTR) అదే పరిస్థితిని అనుభవిస్తున్నారు. ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహిస్తున్న ఆయన.. అన్ని వర్గాల ప్రజలను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే ముస్లింలకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. హిందువుల (Hindu) ఆగ్రహానికి కారణమయ్యాయి.
కేటీఆర్ వ్యాఖ్యలు
‘‘నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా. కేసీఆర్ (KCR) ను గెలిపించకపోతే లౌడ్ స్పీకర్ లలో అజాన్ వినలేరు. ఒకరోజు మీ బిడ్డ మిమ్మల్ని అడగొచ్చు. మీరు ఒకప్పుడు అజాన్ వినేవాళ్లంటగా అని. ఇప్పుడు హిందుస్థాన్ లో ఏం జరుగుతుందో చూస్తున్నాం. ముస్లిం ఇల్లు కనిపిస్తే బుల్డోజర్ తో కూల్చేస్తున్నారు. కేసీఆర్ సెక్యులర్ లీడర్. ఆయన మీకు అండగా ఉంటారు. ఆయన్ను కాపాడుకోవాలి’’ ఇలా ముస్లింలపై ఉన్న ప్రేమను చూపించారు కేటీఆర్. అయితే.. అజాన్ విషయంలో చేసిన వ్యాఖ్యలపై హిందువులు, బీజేపీ (BJP) నేతలు తప్పుబడుతున్నారు.
సెక్యులర్ లీడర్ అని చెప్పుకుంటున్న కేటీఆర్.. ఓట్ల కోసం ముస్లింలను రెచ్చగొడుతున్నారని.. ఇది ఏమాత్రం సబబు కాదంటున్నారు. కాబోయే ముఖ్యమంత్రిని తానే అని ఇతర నేతల చేత చెప్పిస్తున్న ఆయన.. ఇలా హిందూ నాయకులపై ముస్లింలను ఉసిగొల్పడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ రాకముందు ముస్లింలు అజాన్ వినలేదా? ఆయన ఉంటేనే వినబడుతుందా? అని నిలదీస్తున్నారు. అయినా.. ఎక్కడో కరుడుగట్టిన నేరస్థుల ఇళ్లు కూల్చుతుంటే ఇక్కడ కేటీఆర్ కు వచ్చిన బాధేంటని చురకలంటిస్తున్నారు. కావాలనే ముస్లింల ఇళ్లు కూల్చుతున్నారని చెప్పడం హిందువులపై ద్వేషాన్ని పెంచడం కాదా? అని ప్రశ్నిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఓట్ల కోసం వివక్ష చూపిస్తూనే ఉన్నారని.. గతంలో భైంసాలో హిందువుల ఇళ్లపై దాడులు జరిగితే నోరెత్తని కేటీఆర్.. ఎక్కడో నేరస్థుల ఇళ్లను అక్కడి ప్రభుత్వాలు కూల్చుతుంటే.. వాటిని ముస్లింలందరికీ ఆపాదించి మాటాడడం మతకక్ష కాదా? అని నిలదీస్తున్నారు హిందువులు, బీజేపీ నేతలు.
Telangana Hindus Must Watch this Video…
Such low level politics by this shameless idiot, i will fight legally and ensure this daily sound pollution ends, right to live in an atmosphere free from noise pollution is guaranteed by Article 21 of the Indian Constitution.
Telangana… pic.twitter.com/JgVuOY00LQ
— Advocate Neelam Bhargava Ram (@nbramllb) November 10, 2023