Telugu News » Covid 19: భయపెడుతున్న కొత్త వేరియంట్.. డబ్ల్యూహెచ్‌వో కీలక ప్రకటన..!

Covid 19: భయపెడుతున్న కొత్త వేరియంట్.. డబ్ల్యూహెచ్‌వో కీలక ప్రకటన..!

దేశ వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అంతేకాదు.. మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. కొత్త వేరియంట్‌ జేఎన్1(JN1) గుబులు పుట్టిస్తోంది.

by Mano
Covid-19: Again corona chaos.. Five people in the same family are positive..!

ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా(Corona) మహమ్మారి ప్రభావం పూర్తిగా తగ్గిపోయిందని అంతా అనుకున్నారు. అయితే ఊహించని విధంగా కొద్ది రోజులు దేశ వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అంతేకాదు.. మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. కొత్త వేరియంట్‌ జేఎన్1(JN1) గుబులు పుట్టిస్తోంది.

Covid 19: Scary new variant.. WHO's key announcement..!

దేశంలో తొలుత ఈ వేరియంట్‌ కేరళలో వెలుగు చూసింది. అయితే, కొత్త వేరియంట్ కారణంగా మరణాలు సంభవిస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అలర్ట్ జారీ చేసింది. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) కీలక ప్రకటన చేసింది. ఈ వేరియంట్‌తో పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని పేర్కొంది. జేఎన్‌1 వేరియంట్ ప్రజల ఆరోగ్యంపై పెద్దగా ప్రభావం చూపదని తేల్చి చెప్పింది. దీనిని ‘వేరియంట్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌’గా వర్గీకరించారు.

ప్రపంచవ్యాప్తంగా ఈ వేరియంట్‌ ప్రభావం చాలా తక్కువగా ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు జేఎన్‌1తో పాటు ఇతర వేరియంట్ల నుంచి కూడా రక్షణ కల్పిస్తాయని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. ఇందులో భాగంగానే నేడు (బుధవారం) రాష్ట్రప్రభుత్వాలతో కేంద్రం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనుంది. కొవిడ్‌ టెస్ట్‌ల సంఖ్యను పెంచడం మెడికల్‌ కిట్లు, మందులను ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంచడం, గాంధీ ఆస్పత్రిలో ఏర్పాట్లు చేయడం వంటి చర్యలు తీసుకోనున్నారు.

ఇదిలా ఉంటే ఈ కరోనా కొత్త వేరియంట్‌ తొలిసారి ఈ ఏడాది సెప్టెంబర్‌లో అమెరికాలో వెలుగులోకి వచ్చింది. చైనా, సింగపూర్‌తో పాటు పలు దేశాల్లో ఈ సబ్‌ వేరియంట్‌ కేసులు పెరుగుతున్నట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణలో మంగళవారం కొత్తగా నాలుగు కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం 402 మందికి పరీక్షలు నిర్వహించగా నలుగురికి పాజిటివ్‌గా తేలింది. ఏపీలోనూ కొన్ని రోజులుగా కరోనా కేసులు నమోదవుతున్నాయి.

You may also like

Leave a Comment