పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీపీఐ(CPI) పోటీ చేయాలని భావిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో పొత్తు ఉన్నందున ఆ పార్టీ నేతలతో చర్చించి నల్లగొండ-వరంగల్, ఖమ్మం నియోజకవర్గాల గ్రాడ్యుయేట్ స్థానాన్ని(Graduate Mlc) కోరాలని భావిస్తున్నది. లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క స్థానాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ సీపీఐకి కేటాయించలేదు. అందుకే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీని అడుగాలని సీపీఐ యోచిస్తోంది.
అధికార కాంగ్రెస్‌తో పొత్తు ఉన్నందున ఆ పార్టీ నిర్ణయం కూడా తెలుసుకోవాలని సీపీఐ భావిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ తరఫున ప్రస్తుతం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి తీన్మార్ మల్లన్న, రాములు నాయక్ పోటీలో ఉన్నట్లు సమాచారం. గతంలో నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో జనగాం ఎమ్మెల్యేగా గెలుపొందారు.
అనంతరం తన ఎమ్మెల్సీ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో ఖాళీ అయిన ఈ స్థానానికి అటు కాంగ్రెస్, ఇటు సీపీఐ మధ్య నెలకొంది. చివరకు ఈ స్థానం ఎవరిని వరిస్తుందనేది సస్పెన్స్‌గా మారింది.గతంలో సీపీఐ, సీపీఎం మధ్య పరస్పర అవగాహన ఉన్నందున మూడేండ్ల కింద జరిగిన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానంలో నల్లగొండ-వరంగల్-ఖమ్మం జిల్లాల గ్రాడ్యుయేట్ స్థానంలో సీపీఐ, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానాన్ని సీపీఎం పంచుకున్నాయి.
తాజాగా ఈ రెండు పార్టీలు పోటీ విషయమై చర్చించుకోగా..కాంగ్రెస్ పార్టీతో పొత్తు కారణంగా సీపీఐ తన అభిప్రాయన్ని సీపీఎం పార్టీకి చెప్పలేకపోయింది. అధికార పార్టీతో చర్చల అనంతరం దీనిపై ఒక క్లారిటీ రానుంది. అయితే, కాంగ్రెస్ సీపీఐకు ఎమ్మెల్సీ స్థానం కేటాయిస్తుందా? లేదా అనేది సస్పెన్స్‌గా మారింది.