ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ ఉన్న క్రీడల్లో క్రికెట్ (Cricket) ఒకటి. దాదాపు 128 ఏళ్ల తర్వాత క్రికెట్‌కి ఒలింపిక్స్ (Olympics)లో చోటు కల్పిస్తూ అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ నిర్ణయం తీసుకుంది. 2028 లాస్ ఏంజిల్స్ (los Angeles) లో జరగబోయే ఒలింపిక్స్‌లో, టీ20 క్రికెట్ టోర్నీ నిర్వహించనున్నట్టు ఐవోసీ (IOC) ట్వీట్ చేసింది.
క్రికెట్‌తో పాటు ఫ్లాగ్ ఫుట్‌బాల్, బేస్‌బాల్, సాఫ్ట్‌బాల్ సైతం ఒలింపిక్స్ ల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. అయితే బ్యాలెట్ పద్ధతిలో జరిగే ఐఓసీ మెంబర్షిప్ ఓటింగ్‍లో క్రికెట్‍కు మద్దతుగా ఎక్కువ ఓట్లు రావాల్సి ఉంది. ఇది పూర్తయితే 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్ క్రీడల్లో క్రికెట్ ఉండడం పూర్తిగా ఖాయం అవుతుందని ఐఓసీ ప్రెసిడెంట్ థామస్ బాచ్ పేర్కొన్నారు.
కాగా ఈ ఐఓసీ మెంబర్షిప్ ఓటింగ్ ప్రక్రియ అక్టోబర్ 16న జరగనుంది. అప్పటి వరకు అభిమానులు ఎదురు చూడవలసిందే. మరోవైపు ఒలింపిక్స్‌లో క్రికెట్ పోటీలు చివరగా 1900 సంవత్సరంలో జరిగాయి. మళ్లీ 128 ఏళ్ల తర్వాత ఒలింపిక్ క్రీడల్లో క్రికెట్ పోటీల నిర్వహణకు అడుగులు పడుతున్నాయి. మొత్తానికి క్రికెట్ అభిమానుల ఆశలు నెరవేరడానికి ఎక్కువ సమయం లేదు అనిపిస్తోంది.
cricket-in-olympics-2028-los-angeles-organising-committee-to-introduce