Telugu News » IOC : ఇక ఒలింపిక్స్‌లో క్రికెట్… ఐఓసీ కీలక నిర్ణయం…..!

IOC : ఇక ఒలింపిక్స్‌లో క్రికెట్… ఐఓసీ కీలక నిర్ణయం…..!

ఒలింపిక్స్ లో క్రికెట్ ను టీ-20 ఫార్మాట్ లో నిర్వహించనున్నారు.

by Ramu

అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ (International Olympic Committee) కీలక ప్రకటన చేసింది. 2028 ఒలింపిక్స్ క్రీడల్లో క్రికెట్ (Cricket) ను చేర్చబోతున్నట్టు ఐఓసీ ప్రకటించింది. ముంబై (Mumbai) లో నిర్వహించిన ఓ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఒలింపిక్స్ లో క్రికెట్ ను చేర్చే విషయంపై ఈ సమావేశంలో ఓటింగ్ ను నిర్వహించారు.

ఈ సమావేశంలో కేవలం ఇద్దరు సభ్యులు మాత్రమే ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. ఈ క్రమంలో ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు చోటు కల్పిస్తున్నట్టు ఒలింపిక్ కమిటీ నిర్ణయం తీసుకుంది. క్రికెట్‌ తో పాటు మరో నాలుగు కొత్త క్రీడలకు ఒలింపిక్స్‌లో అవకాశం కల్పించారు. వాటిలో బేస్‌బాల్‌- సాఫ్ట్‌బాల్‌, ఫ్లాగ్‌ ఫుట్‌బాల్‌, లక్రాస్‌ (సిక్సస్‌), స్క్వాష్‌లు ఉన్నాయి.

ఒలింపిక్స్ లో క్రికెట్ ను టీ-20 ఫార్మాట్ లో నిర్వహించనున్నారు. ఒలింపిక్స్ కమిటీ నిర్ణయంపై ఐఓసీ సభ్యురాలు నీతూ అంబానీ స్పందించారు. 1.4 బిలియన్ల భారతీయులకు క్రికెట్ అంటే కేవలం ఒక క్రీడ మాత్రమే కాదన్నారు. భారతీయులకు క్రికెట్ అనేది ఒక మతం (Religion) అని అన్నారు.

అందువల్ల ఒలింపిక్స్ లో క్రికెట్ ను చేరుస్తూ ఐఓసీ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైనదని ఆమె పేర్కొన్నారు. 1990లో మొదటి సారిగా ఒలింపిక్స్ లో క్రికెట్ ను నిర్విహించారు. ఒలింపిక్స్ లో క్రికెట్ మ్యాచ్ లు జరగడం అదే తొలిసారి, చివరి సారి కావడం విశేషం. తాజాగా మరోసారి ఒలింపిక్స్ లో క్రికెట్ ను చేరుస్తూ ఐఓసీ తీసుకున్న నిర్ణయంపై క్రికెట్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

You may also like

Leave a Comment