Telugu News » Dasoju Sravan : తెలంగాణ రాజకీయాలకు పట్టిన శని రేవంత్ రెడ్డి…!

Dasoju Sravan : తెలంగాణ రాజకీయాలకు పట్టిన శని రేవంత్ రెడ్డి…!

తెలంగాణ రాజకీయాలకు పట్టిన శని రేవంత్ అని నిప్పులు చెరిగారు.

by Ramu
Dasoju sravan serious comments on cm revanth reddy
అధికార గర్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తన నరనరాల్లోకి ఎక్కించుకున్నారని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ (Dr Sravan) అన్నారు. తెలంగాణ రాజకీయాలకు పట్టిన శని రేవంత్ అని నిప్పులు చెరిగారు.తెలంగాణ తెచ్చిన వ్యక్తి అని కూడా చూడకుండా, కనీసం కేసీఆర్ వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా రేవంత్ రెడ్డి అసభ్యంగా మాట్లాడుతున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
Dasoju sravan serious comments on cm revanth reddy
తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌కు గోరీ కడతావా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ మీద భాష ఇలాగే కొనసాగితే రేవంత్ నాలుక చీరేసే బాధ్యత తెలంగాణ ప్రజలు తీసుకుంటారని అన్నారు. గల్లీ లీడర్ కన్నా చిల్లరగా రేవంత్ తీరు ఉందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ గడ్డి అన్నం తింటున్నాడా? లేదా గడ్డి తింటున్నాడా ? అని ఫైర్ అయ్యారు.
అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్నారు. ఐదేండ్ల తర్వాత కాంగ్రెస్‌ సీఎంగా ఎవరుంటారో తెలియదని చెప్పారు. కాంగ్రెస్‌‌ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనూ ఐదేండ్ల తర్వాత పాత సీఎంను కొనసాగించలేదన్నారు. రేవంత్ రెడ్డి తీరు మార్చడం రాహుల్ గాంధీ వల్లే అవుతుందని.. వెంటనే రేవంత్‌పై రాహుల్ గాంధీ దృష్టి పెట్టాలని హితవు పలికారు.
బిల్లా రంగాలకు ప్రతి రూపం రేవంత్ రెడ్డేనని తీవ్రంగా విరుచుకుపడ్డారు. అద్దం ముందు కూర్చుని రేవంత్ ఓ సారి మొహం చూసుకోవాలని సూచించారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడిగితే అంత ఉలిక్కిపాటు ఎందుకని ప్రశ్నించారు. కేసీఆర్ కన్నా మంచి పాలన అందించడంలో రేవంత్ పోటీ పడాలని సూచనలు చేశారు. రేవంత్‌కు చేతనైతే కృష్ణ రివర్ బోర్డు విషయంలో కేంద్రం మెడలు వంచేందుకు కృషి చేయాలన్నారు.

 

You may also like

Leave a Comment