Telugu News » Delhi Riots: ఢిల్లీ అల్లర్ల వెనుక ఐసిస్ హస్తం…. ఓపీ ఇండియా కథనంలో సంచలన విషయాలు….!

Delhi Riots: ఢిల్లీ అల్లర్ల వెనుక ఐసిస్ హస్తం…. ఓపీ ఇండియా కథనంలో సంచలన విషయాలు….!

దేశ వ్యాప్తంగా ఉగ్రదాడులకు ప్లాన్ చేసిన ముగ్గురు ఉగ్రవాదులను ఎన్ఐఏ అరెస్టు చేసింది.

by Ramu
Delhi anti Hindu Riots now has a clear ISIS link

2020లో ఢిల్లీ (Delhi)లో జరిగిన మత ఘర్షణలకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ అల్లర్ల వెనుక ఐఎస్ఐస్ హస్తం ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల ఐసిస్‌తో సంబంధాలు వున్న ముగ్గురు జిహాదీలను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అరెస్టు చేసింది. దర్యాప్తు సమయంలో వారి నుంచి ఎన్ఐఏ కీలక విషయాలు సేకరించినట్టు తెలుస్తోంది. ఓపీ ఇండియా కథనం ప్రకారం…….

Delhi anti Hindu Riots now has a clear ISIS link

 

దేశ వ్యాప్తంగా ఉగ్రదాడులకు ప్లాన్ చేసిన ముగ్గురు ఉగ్రవాదులను ఎన్ఐఏ అరెస్టు చేసింది. విదేశీ ఉగ్ర సంస్థల ఆదేశాల మేరకు దేశ వ్యాప్తంగా దాడులు చేసేందుకు ఆ ముగ్గురు ప్లాన్ చేశారు. ఈ మేరకు జార్ఖండ్‌కు చెందిన హషన్ వాజ్ ఆలం, మహ్మద్ అర్షద్, లక్నోకు చెందిన మహ్మద్ రిజ్వాన్ అష్రఫ్ లను ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. వారిలో షహన్ వాజ్‌ను ఢిల్లీలో అరెస్టు చేసింది.

గతంలో ఆ నిందితులపై రూ. 3 లక్షల నగదు రివార్డును ప్రకటించింది. నిందితులు షహన్ వాజ్, అబ్దుల్లా, రిజ్వాన్ లు ఉగ్రవాదం పట్ల ప్రేరేపితులై టెలిగ్రామ్ యాప్ ద్వారా ఐఎస్ఐఎస్‌లో చేరారు. అనంతరం దేశ వ్యాప్తంగా దాడులు జరిపేందుకు ప్లాన్ చేశారు. 2016లో షానవాజ్ ఢిల్లీకి చేరుకున్నాడు. అక్కడ షహీన్ బాగ్‌లో రాడికల్ ఇస్లామిక్ గ్రూపు హిజ్బ్-ఉత్-తహ్రీర్ ప్రసంగాలు వినేవాడు.

ఆ సమయంలోనే ఉగ్రవాదం వైపు ఆకర్షితుడయ్యాడు. ఆ క్రమంలో షహనవాజ్ రిజ్వాన్ ను కలుసుకున్నాడు. వారిద్దరూ కలిసి ఉగ్రకార్యకలాపాలు మొదలు పెట్టారు. ఇక మరో నిందితుడు అర్షద్ వార్సీ 2016లో ఢిల్లీకి చేరుకున్నాడు. అక్కడ ఓ కార్యక్రమంలో షానవాజ్‌తో అర్షద్ వార్సీకి సంబంధాలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత ఐసిస్ ఉగ్రవాదులతో కలిసి ఢిల్లీలో పేలుళ్లకు అర్హద్ వార్సి కుట్రలు పన్నారు.

ఇది ఇలా వుంటే ఢిల్లీ షహీన్ బాగ్ అల్లర్ల వెనుక అర్షద్ తో పాటు షార్జిల్ ఇమామ్ హస్తం వున్నట్టు పోలీసులు గుర్తించారు. షార్జిల్‌కు ఉగ్ర సంస్థతో సంబంధాలు ఉన్నట్టు అతని ఫోన్ చాటింగ్ ద్వారా గుర్తించారు. షార్జిల్ తో పాటు అర్షద్ సంభాషణలు జరిపినట్టు దర్యాప్తులో వెల్లడైంది. ఢిల్లీలో అల్లర్లు సృష్టించేందుకు షార్జిల్ ప్రయత్నించాడని ఎన్ఐఏ విచారణలో తెలిసింది.

రామ జన్మభూమిలో సుప్రీం కోర్టు ఆదేశాల గురించి ప్రస్తావిస్తూ ముస్లిం వర్గాల్లో ద్వేషాన్ని రెచ్చగొట్టేలా షార్జిల్ కరపత్రాలు పంచినట్టు గుర్తించారు. ఆ తర్వాత యునైటెడ్ అగెయినెస్ట్ హేట్ సంస్థ చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొనున్నట్టు షార్జిల్ ఇమామ్ వెల్లడించినట్టు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత ఆ సమావేశాలను విజయవంతం చేయాలని అర్షద్ వార్సి ఎంఎస్ జే గ్రూపు సభ్యులతో సమావేశంలో పేర్కొన్నారు.

అనంతరం 2020 డిసెంబర్ 8న షార్జిల్ ఇమామ్, యోగేంద్ర యాదవ్ మధ్య రహస్య సమావేశం జరిగింది. ఢిల్లీలో చక్కా జామ్ ఎలా నిర్వహించాలనే విషయంపై ఈ సమావేశంలో ప్రణాళికలు రచించారు. ఢిల్లీలోని పలు యూని వర్శిటీలు, కళాశాలలకు చెందిన విద్యార్థులతో ర్యాలీని ఎలా నిర్వహించాలనే దానిపై పక్కా ప్రణాళికను రచించారు. దీనికి సంబంధించిన విషయాలను షార్జిల్ వాట్సాప్ చాట్ రివీల్ చేసింది.

అనంతరం ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా నిరసనలు మొదలయ్యాయి. ఆ తర్వాత జమియా మిలియా ఇస్లామియా సంస్థకు చెందిన విద్యార్థులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పోలీసులకు వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేశారు. ఆ వెంటనే ఒక్క సారిగా హింసకు దిగారు. దీంతో సీఏఏ వ్యతిరేక అల్లర్లు కాస్త మత ఘర్షణలుగా టర్న్ తీసుకున్నాయి.

You may also like

Leave a Comment