Telugu News » Congress : బీఆర్ఎస్ లీడర్ నిర్మాణాల కూల్చివేత.. ఇల్లందు అవిశ్వాస ఎఫెక్టేనా..?

Congress : బీఆర్ఎస్ లీడర్ నిర్మాణాల కూల్చివేత.. ఇల్లందు అవిశ్వాస ఎఫెక్టేనా..?

ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు అవిశ్వాస తీర్మానంలో తన భర్త గణేష్ కీలక పాత్ర పోషించారని.. కావాలనే కాంగ్రెస్ నేతలు కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు సరిత.

by admin
Demolitions in brs councillor lands

– మరోసారి చర్చనీయాంశంగా ఇల్లందు మున్సిపాలిటీ
– బీఆర్ఎస్ కౌన్సిలర్ కొండపల్లి సరిత నిర్మాణాల కూల్చివేత
– ఫారెస్ట్ భూమిలో కోళ్ల ఫారం, మామిడి తోట నిర్వహణ
– పోలీస్ ఫోర్స్ తో కూల్చివేయించిన ఫారెస్ట్ అధికారులు
– చాలాకాలంగా మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ భర్త మధ్య వివాదం
– అవిశ్వాస తీర్మానంలో కీ రోల్ పోషించిన గణేష్

తెలంగాణ (Telangana) లో ప్రభుత్వం మారడంతో మున్సిపాలిటీల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒక్కో మున్సిపాలిటీ అధికార కాంగ్రెస్ (Congress) వశమౌతోంది. బీఆర్ఎస్ (BRS) కు చెందిన కౌన్సిలర్లు ఒక్కొక్కరుగా జారుకోవడంతో సీన్ మారిపోతోంది. ఈ క్రమంలోనే ఇల్లందు (Yellandu) మున్సిపాలిటీ అవిశ్వాస తీర్మానం హైడ్రామాకు దారి తీసింది. గతంలో బీఆర్ఎస్ లో ఉన్న చైర్మన్ కాంగ్రెస్ గూటికి చేరాక.. కొందరు వార్డు కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్ ను కలిసి అవిశ్వాసం కోరుతూ వినతిపత్రం అందజేశారు. అందుకు అనుగుణంగా ఈమధ్య మున్సిపల్ కార్యాలయంలో ఆర్డీఓ శిరీష నేతృత్వంలో అవిశ్వాస తీర్మాన సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

Demolitions in brs councillor lands

తీవ్ర ఉత్కంఠ నడుమ 15 మంది కౌన్సిలర్లు మాత్రమే హాజరవ్వడంతో అవిశ్వాసం వీగిపోయింది. మున్సిపల్ చట్ట నిబంధనల ప్రకారం ఉన్న 24 వార్డు కౌన్సిలర్లలో మూడో వంతు సమావేశానికి హాజరు కావాల్సి ఉంది. అంటే, 17మంది వార్డు కౌన్సిలర్లు సమావేశంలో ఉంటేనే అవిశ్వాసం నెగ్గుతుంది. అయితే.. అవిశ్వాసం కోరిన అసమ్మతి వార్డు కౌన్సిలర్లు క్యాంపు నుండి మున్సిపల్ కార్యాలయానికి చేరుకోగానే ఇద్దర్ని అధికార కాంగ్రెస్ పార్టీ కిడ్నాప్ చేసిందని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపించారు.

Demolitions in brs councillor lands

ఈ అవిశ్వాసం విషయంలో బీఆర్ఎస్ కౌన్సిలర్ సరిత భర్త గణేష్ కీ రోల్ పోషించారు. కాంగ్రెస్ నేతలను టెన్షన్ పెట్టించారు. అయితే.. అవిశ్వాస వ్యవహారం జరిగి రెండు రోజులు కూడా గడవకముందే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలపల్లి సమీపంలో కౌన్సిలర్ కొండపల్లి సరిత, కొండపల్లి మనీలాకు చెందిన భూములపై అధికారులు దాడులు జరపడం చర్చనీయాంశమైంది. మంగళవారం రాత్రి సర్వే పేరుతో అధికారులు ఆ భూముల మీదకి వెళ్లే క్రమంలో కొండపల్లి కుటుంబం అడ్డుకుంది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఫారెస్ట్ అధికారులు వెనుతిరిగారు.

Demolitions in brs councillor lands 1

మంగళవారం ఉదయం పోలీస్ ఫోర్స్ తో వచ్చిన ఫారెస్ట్ అధికారులు.. భూమిలో నిర్మాణం చేసి ఉన్న కోళ్ల ఫారంపై దాడులు ప్రారంభించారు. పొలంపల్లి సమీపంలోని 549 సర్వే నెంబర్ గల భూమిలో ఉన్న 20 ఎకరాలు ఫారెస్ట్ పరిధిలో ఉన్నాయని అధికారులు ఈ దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. స్థలంలోని నిర్మాణాలను, మామిడి తోటను జేసీబీతో ధ్వంసం చేశారు. తమకు హక్కు పత్రాలు ఉన్నా కూడా అన్యాయంగా తమ భూములను ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారని కౌన్సిలర్ కుటుంబం ఆరోపిస్తోంది. ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు అవిశ్వాస తీర్మానంలో తన భర్త గణేష్ కీలక పాత్ర పోషించారని.. కావాలనే కాంగ్రెస్ నేతలు కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు సరిత.

You may also like

Leave a Comment