Telugu News » Great : యంగ్ క్రికెటర్ కి లిఫ్ట్ ఇచ్చిన ధోనీ భాయ్ ..!

Great : యంగ్ క్రికెటర్ కి లిఫ్ట్ ఇచ్చిన ధోనీ భాయ్ ..!

మహేంద్ర సింగ్ ధోనీ(Mahendra Singh Dhoni)..భారత క్రికెట్ జట్టుకు దొరికిన ఆణిముత్యం.బీబీసీసీఐ(BBCCI) అప్పగించిన నాయకత్వ బాధ్యతలను సర్వోన్నతంగా నిర్వర్తించి టీమిండియాను విక్టరీబాట పట్టించాడు.

by sai krishna

మహేంద్ర సింగ్ ధోనీ(Mahendra Singh Dhoni)..భారత క్రికెట్ జట్టుకు దొరికిన ఆణిముత్యం.బీబీసీసీఐ(BBCCI) అప్పగించిన నాయకత్వ బాధ్యతలను సర్వోన్నతంగా నిర్వర్తించి టీమిండియాను విక్టరీబాట పట్టించాడు.


జట్టు సభ్యుడిగా ఉన్నప్పుడు సీనియర్స్ తోను, తన తోటి వారితోను,తన కన్నా చిన్నవాళ్లతోను ఎలా వ్యవహరించాడో..కెప్టెన్ గా ఉన్నప్పుడు కూడా అలాగే వ్యవహరించాడు.అతని స్నేహశీలత జట్టులో ఎలాంటి ఒడిదుడుకులు రాకుండా ముందుకు నడిపింది.

మిస్టర్ కూల్ గా అంతర్జాతీయంగా మన్ననలు పొందేలా చేసింది. అందుకే ఇంటర్నేషనల్ క్రికెట్ కు గుడ్ బై చెప్పినా ఇప్పటికీ ధోనీ క్రేజ్ తగ్గలేదు. తాజాగా, ఓ యువ క్రికెటర్ ను ఎక్కించుకుని ధోనీ బైక్ రైడింగ్ చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.

రాంచీ స్టేడియం(Ranchi Stadium)లో ప్రాక్టీసు ముగించుకున్న ధోనీ…అక్కడే ఉన్న ఓ యువ క్రికెటర్ కు బైక్ పై లిఫ్ట్ ఇచ్చాడు.స్పోర్ట్స్ బైక్..పైగా నడుపుతున్నది లెజెండ్ ధోనీ..ఇక ఆ కుర్ర క్రికెటర్ ఆనందానికి హద్దేముంటుంది చెప్పండి. బైక్ పై వెళుతున్నంత సేపు తన మొబైల్ తో చిత్రీకరించిన ఆ టీనేజర్ ఆ వీడియోను నెట్టింట పంచుకున్నాడు.

You may also like

Leave a Comment