క్రికెటర్ మొహమ్మద్ షమీ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. షమీ ఎన్నో మ్యాచ్ల తో తన ట్యాలెంట్ ని మనందరికీ చూపించారు. ఇండియా టీం గెలుపుకి ఎన్నోసార్లు కారణమయ్యారు. ఒక రైతు కొడుకు అయి ఇప్పుడు తన ఆటతో టాలెంట్ తో అందరికీ దగ్గరయ్యాడు. అందరూ మెచ్చుకునే స్థాయికి చేరుకున్నాడు. వాళ్ళ నాన్నగారు 15 ఏళ్లు పాటు షమీ కి ఎంతో సపోర్ట్ ఇచ్చారు. ఫాస్ట్ బౌలర్ ని చేయడానికి 15 ఏళ్ల పాటు కష్టపడ్డాడు.
టీమిండియా బౌలింగ్ విభాగాన్ని భుజాలపై వేసుకుని జట్టు ని ఫైనల్స్ కి చేర్చాడు ఒక మ్యాచ్ తో రికార్డులు బద్దలుకొట్టేసాడు. ఒకప్పుడు దేశద్రోహి అని తిట్టిన వాళ్లే నేడు ప్రశంసలతో ముంచేస్తున్నారు. షమీ జీవితంలో ఎన్నో అవమానాలు, అవరోధాలు కూడా ఉన్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య తన వలన బాధ ఉందని కట్నం కోసం కూడా బాధ పెడుతున్నాడని ఇలా ఎన్నో ఆరోపణలు చేశారు. ఆఖరికి కోర్టుకు కూడా లాగింది.
Also read:
ఆ టైంలో తీవ్ర మానసిక వేదన కి గురయ్యాడు మా ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే క్రికెట్ ని వదిలి ఉండే వాడిని, మూడుసార్లు ఎంతో బాధపడ్డానని, ఆ$త్మ$హ$త్య చేసుకోవాలని కూడా అనుకున్నాడట షమీ. అలా జరుగుతుందేమోనని నా కుటుంబ సభ్యులు భయపడ్డారు నా మీద ఒక కన్ను వేసేవారు అని చెప్పుకొచ్చారు షమీ. 1990లో ఉత్తరప్రదేశ్లో పుట్టారు షమీ. వాళ్ళ నాన్నగారు చెరుకు పండిస్తూ ఉండేవారు. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎన్నో కష్టాలని దాటుకుంటూ షమీ ఈరోజు అందరూ శభాష్ అనే విధంగా మారారు. ఇప్పటికే షమీ మూడుసార్లు ఐదు వికెట్లు తీసిన టాప్ వికెట్ టేకర్ గా నిలిచారు. న్యూజిలాండ్ తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో 7 వికెట్లు తీసిన షమీకి ఇండియా సెల్యూట్ చేస్తోంది.