Telugu News » BJP : త్వరలోనే కాంగ్రెస్‌లోకి దుబ్బాక ఎమ్మెల్యే.. మెదక్ ఎంపీ అభర్థి రఘునందన్ రావు సంచలన కామెంట్స్!

BJP : త్వరలోనే కాంగ్రెస్‌లోకి దుబ్బాక ఎమ్మెల్యే.. మెదక్ ఎంపీ అభర్థి రఘునందన్ రావు సంచలన కామెంట్స్!

పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు బీజేపీ (BJP) పార్టీ రాష్ట్రంలో తీవ్రంగా శ్రమిస్తోంది. ప్రస్తుత కాంగ్రెస్(Congress) ప్రభుత్వం ఆరు గ్యారెంటీల(Six guarantees) అమలులో వైఫ్యలం చెందడంతో పాటు గత బీఆర్ఎస్ సర్కారు అవినీతి, అక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి తెలంగాణలో డబుల్ డిజిట్ స్థానాలను సాధించాలని చూస్తోంది. కేంద్రంలో నరేంద్ర మోడీ (PM MODI) ఛరిష్మాను అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో బీజేపీ పాగా వేయాలని చూస్తోంది.

by Sai
Dubbaka MLA to join Congress soon.. Sensational comments of Medak MP Abharthi Raghunandan Rao!

ఈ క్రమంలోనే రఘునందన్ రావు సోమవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక రెడ్డి ఫంక్షన్ హాల్‌లో మెదక్ పార్లమెంట్ కిసాన్ మోర్చా సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు(Medak mp Candidate Raghu Nandan Rao) మాట్లాడుతూ.. దుబ్బాక నియోజకవర్గం మీద ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి అవగాహన లేదన్నారు. ఆయనకు డబ్బులు పెట్టి ఓట్లు కొనడం మాత్రమే తెలుసునని ఎద్దేవా చేశారు.

ఓటర్లను బానిసలుగా చూసే సంస్కారం కొత్త ప్రభాకర్ రెడ్డి(Dubbaka Mla Kotta Prabakar reddy) ది అని, పార్లమెంట్ ఎన్నికలు పూర్తి అయ్యాక దుబ్బాక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమని జోస్యం చెప్పారు.గల్లీలో, ఢిల్లీలో లేని కారును గెలిపిస్తే మనకు మిగిలేది శూన్యమని రఘునందన్ రావు కిసాన్ మోర్చాకు హాజరైన ఓటర్లకు వివరించారు. ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఐదు నెలలు గడుస్తున్నా ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని విమర్శించారు.

గతంలో కేసీఆర్ నూరు అబద్ధాలు ఆడితే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 1000 అబద్ధాలు ఆడేందుకు సిద్దంగా ఉన్నాడని సెటైర్ వేశారు. కాంగ్రెస్ హయాంలో రైతులు ఎరువుల కోసం చెప్పులు లైన్‌లో పెట్టిన విషయాన్ని ప్రజలు మరవద్దన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక ఎక్కడా ఎరువుల కొరత లేకుండా చూశారని చెప్పారు. కమలం గుర్తుకు ఓటు వేసి తనను నరేంద్ర మోడీ నాయకత్వంలో పనిచేసేందుకు పంపాలని రఘునందన్ రావు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

You may also like

Leave a Comment