Telugu News » Earthquake: మొరాకోలో భారీ భూకంపం…600 మంది దుర్మరణం..!

Earthquake: మొరాకోలో భారీ భూకంపం…600 మంది దుర్మరణం..!

ఉత్తర ఆఫ్రికా(North Africa)లోని మొరాకో(Morocco)లో భూమితల్లి కన్నెర్రజేసింది, ఉన్నట్టుండి భూప్రకంపనలు రావడంతో భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి.

by sai krishna

ఉత్తర ఆఫ్రికా(North Africa)లోని మొరాకో(Morocco)లో భూమితల్లి కన్నెర్రజేసింది, ఉన్నట్టుండి భూప్రకంపనలు రావడంతో భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. ఈ భూప్రళయంలో మరణంచిన వారి సంఖ్య 600 కు చేరింది. యునైటెడ్ స్టేట్స్ జిలయోలాజికల్(USGS) సర్వే ప్రకారం రిక్టర్ స్కేల్ పై 6.8 నమోదయ్యింది.

గత 120 యేళ్లలో ఇంత శక్తివంతమైన భూకంపం సంభవించటం ఉత్తర ఆఫ్రికాలో ఇదే మొదటిసారని తెలిపింది. విధ్వంసానికి సంబంధించిన అనేక చిత్రాలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొరాకోలో శుక్రవారం రాత్రి నిద్రలో ఉన్న సమయంలో అకస్మాత్తుగా నివాసితులు ఇళ్ళు ఊగుతున్నట్లు గ్రహించారు.


మరు క్షణంలో భూకంపంతో ఈ ప్రాంతంలోని భవనాలన్నీ నేలమట్టమయ్యాయి. కొందరు భయంతో బయటకు వచ్చేలోపే పలు ఇళ్లు కుప్పకూలిపోయాయి. విద్యుత్, టెలికాం కనెక్షన్లు వెంటనే తెగిపోయాయి. భవన శిథిలాల నుంచి .. ఏడుపులు,ఆర్తనాదాల శబ్దం మాత్రమే వినిపించాయని చెబుతూ కొందరు బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. భూప్రకంపన ధాటికి నదిలో నీరు ఉప్పొంగి ఒడ్డును తాకింది.

యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం, ఈ ప్రకంపనల మూలం మొరాకోలోని మరకేష్(Marrakesh)నుండి 71 కి.మీ.లో 18.5 కి.మీ. లోతులో ఏర్పడింది. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 11:00 గంటలకు ప్రకంపనలు సంభవించాయి. తీర ప్రాంతాల్లోని రబాత్, కాసాబ్లాంకా, ఎస్సోయిరా ఈ భూకంపానికి ఎక్కువగా ప్రభావితయ్యాయి.


ప్రజలు ఇళ్లలో ఉండవద్దని..రక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లమంటూ అధికారులు హెచ్చరించారు. మరికొందరు వీధుల్లో నిద్రించడానికి ప్రయత్నిస్తున్నారు. మొరాకో చరిత్రలో ఇంతటి భయంకరమైన భూకంపం ఎప్పుడూ సంభవించలేదని అంటున్నారు. మొరాకోతోపాటు..పొరుగున ఉన్న అల్జీరియాలో భూ ప్రకంపనలు వచ్చాయి.


ఈ ఘటనపై స్పందిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు.ప్రజల మరణవార్త చాలా బాధ కలిగించిందని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఈ కష్ట సమయంలో మొరాకో ప్రజలకు తన సానుభూతిని తెలియజేస్తూ .. భారతదేశం అన్ని సహాయానికి సిద్ధంగా ఉందని మొరాకో ప్రజలకు హామీనిచ్చారు.

You may also like

Leave a Comment