Telugu News » Rajasthan : కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం…. ఆ రాష్ట్ర ఎన్నికల తేదీలు మార్పు….!

Rajasthan : కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం…. ఆ రాష్ట్ర ఎన్నికల తేదీలు మార్పు….!

ఎన్నికల తేదీని మార్చాలంటూ వివిధ వర్గాల నుంచి విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీఈసీ వెల్లడించింది.

by Ramu

కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్ (Rajasthan) అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) తేదీలను మారుస్తూ నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్ ఎన్నికలను నవంబర్ 23 నుంచి అదే నెల 25కు మారుస్తున్నట్టు ఈసీ వెల్లడించింది.ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఎన్నికల తేదీని మార్చాలంటూ వివిధ వర్గాల నుంచి విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీఈసీ వెల్లడించింది.

నవంబర్ 23న రాజస్థాన్‌లో దేవ్ ఉదాని ఏకాదశిని ప్రజలు జరుపుకుంటారు. ఏకాదశి రోజును రాజస్థానీలు శుభదినంగా భావిస్తారు. అందుకే ఆ రోజుల్లో ఎక్కువగా శుభకార్యాలు జరపుకుంటారు. ఈ ఏడాది దేవ్ ఉదానీ ఏకాదశి రోజున సుమారు 50 వేలకు పైగా వివాహాలు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో రాష్ట్రంలో ఎక్కువ మంది వివాహ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది.

ఈ క్రమంలో అత్యధికులు ఓటింగ్ కు దూరంగా ఉండే అవకాశం ఉందని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. దీంతో ఓటింగ్ పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని చెబుతున్నాయి. దీంతో పాటు భారీగా రవాణా సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని అంటున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలను వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని రాజకీయ పార్టీలు కోరాయి.

విభిన్న వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో ఎన్నికల సంఘం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. అంతకు ముందు రాజస్థాన్ తో పాటు మరో నాలుగు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ను ఈసీ ప్రకటించింది. రాజస్థాన్ తో పాటు తెలంగాణ, మధ్య ప్రదేశ్, చత్తీస్ గఢ్, మిజోరాంలలో డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలను ప్రకటించనున్నట్టు పేర్కొంది.

You may also like

Leave a Comment