Telugu News » ED: రేషన్ పంపిణీ స్కామ్…. మంత్రి నివాసంలో ఈడీ సోదాలు…!

ED: రేషన్ పంపిణీ స్కామ్…. మంత్రి నివాసంలో ఈడీ సోదాలు…!

మంత్రి మల్లిక్ కు చెందిన రెండు ఫ్లాట్లలో ఈడీ సోదాలు చేస్తోంది.

by Ramu

బెంగాల్‌లో ఈడీ (ED) దాడులు చేస్తోంది. రేషన్ పంపిణీ స్కామ్‌ (Ration Distribution Scam)కు సంబంధించి మంత్రి జ్యోతి ప్రియో మల్లిక్ నివాసంలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. మంత్రి మల్లిక్ కు చెందిన రెండు ఫ్లాట్లలో ఈడీ సోదాలు చేస్తోంది. తనిఖీల నేపథ్యంలో కోల్ కతాలోని సాల్ట్ లేక్ ఏరియాలోని ఆయన నివాసం వద్ద భారీగా బందో బస్తు ఏర్పాటు చేశారు.


మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నట్టు ఈడీ వర్గాలు వెల్లడించాయి. మల్లిక్ వ్యక్తిగత మాజీ సహాయకుడి నివాసంతో పాటు ఆయన సన్నిహితుల నివాసాల్లో సోదాలు చేస్తున్నట్టు ఈడీ వర్గాలు పేర్కొన్నాయి. తనిఖీల సమయంలో మంత్రి తన నివాసంలో లేరని వెల్లడించాయి. ఈ తనిఖీల్లో ఎనిమిది అధికారుల పాల్గొన్నట్టు చెప్పాయి.

డండంలోని మంత్రి వ్యక్తిగత మాజీ సహాయకునికి చెందిన నివాసంలో కూడా సోదాలు చేస్తున్నట్టు చెప్పాయి. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఒకరికి ఈడీ అరెస్టు చేసింది. జ్యోతి ప్రియ మాలిక్ ప్రస్తుతం అటవీ శాఖ మంత్రిగా పని చేస్తున్నారు. గతంలో ఆయన ఆహార మంత్రిగా పని చేశారు.

ఇది ఇలా వుండగా రాష్ట్రంలో కోట్లాది రూపాయల రేషన్ పంపిణీ కుంభకోణానికి సంబంధించి ఇటీవల కోల్‌కతాకు చెందిన వ్యాపారవేత్త బకీబుర్ రెహ్మాన్ ను ఈడీ అరెస్టు చేసింది. అతని దగ్గరు 100 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఈడీ గుర్తించింది. ఈ నేపథ్యంలో రెహ్మాన్ ను ఈడీ విచారిస్తోంది.

You may also like

Leave a Comment