ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Liquor Scam) లో మరోసారి ఈడీ (Enfocement Directorate) మరోసారి దూకుడు పెంచింది. తాజాగా ఆప్ నేత, రాజ్య సభ ఎంపీ సంజయ్ సింగ్ నివాసంలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ఆప్ నేత, ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్ ఈ రోజు సుప్రీం కోర్టులో విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో ఈడీ దాడులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ఛార్జిషీట్‌లో ఆప్ నేత సంజయ్ సింగ్ పేరును ఈడీ గతంలో చేర్చింది. ఢిల్లీ వ్యాపారి దినేష్ సింగ్ సీఎం కేజ్రీవాల్‌తో సమావేశం అయ్యారని ఈడీ పేర్కొంది. ఈ సమావేశం సంజయ్ సింగ్ సమక్షంలో జరిగినట్టు ఈడీ అభియోగాలు మోపింది. గతంలో ఒక ఈవెంట్‌లో సంజయ్ సింగ్ ను తాను కలిశానని అరోరా చెప్పినట్టు ఈడీ చార్జ్ షీట్ లో పేర్కొంది.
ఆ తర్వాత ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాతో సమావేశమైనట్టు అరోరా పేర్కొన్నారని ఈడీ తెలిపింది. ఢిల్లీ ఎన్నికల కోసం నిధుల సేకరణ కోసం ఆ ఈవెంట్ ను ఏర్పాటు చేసినట్టు ఈడీ చెప్పింది. ఆ తర్వాత సంజయ్ సింగ్ అభ్యర్థన మేరకు దినోశ్ అరోరా పలువురు రెస్టారెంట్ యజమానులతో మాట్లాడి ఆప్ ఎన్నికల నిధుల కోసం రూ. 32 లక్షల చెక్ అప్పటి డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు దినేశ్ అరోరా అందించారు.
ఈ కేసులో అప్రూవర్లుగా మారేందుకు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి కుమారుడు మాగుంట రాఘవ, ఢిల్లీ వ్యాపారి దినోష్ అరోరాలకు ఢిల్లీ న్యాయస్థానం అనుమతులు ఇచ్చింది. ఈ కేసులో ఈడీ విచారణకు సహకరించాలని ఆ ఇద్దరి నిందితులకు స్పెషల్ జడ్డి జస్టిస్ నాగపాల్ సూచించారు. ఈ కేసు విషయంలో నిందితులు తమకు తెలిసిన అన్ని విషయాలను దర్యాప్తు సంస్థలకు అందించాలని ఆదేశించారు.