కేసీఆర్ (KCR) వస్తున్నాడనగానే కాంగ్రెస్ (Congress) నేతల లాగులు తడుస్తున్నాయని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి (Jagadeesh Reddy) అన్నారు. ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పజెప్పి కాంగ్రెస్ నేతలు దొంగ నాటకాలు ఆడుతున్నారని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ నేతలు దద్దమ్మలని.. అందుకే నాగార్జున సాగర్ ప్రాజెక్టును కేంద్రానికి అప్పజెప్పారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ నేతలకు అహంకారం పెరిగిందని అన్నారు. కాంగ్రెస్ సీఎం, కేబినెట్ అంతా రండనేనని.. కేసీఆర్‌పై ఎదురుదాడి చేసి తప్పించుకోవాలని చూస్తున్నారన్నారని మండి పడ్డారు. రైతు బంధు నిలిపివేశారని, రైతుబంధు అడిగితే చెప్పుతో కొడతామంటున్నారని ఫైర్ అయ్యారు. కోమటిరెడ్డి లాంటోడు మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నాడని నిప్పులు చెరిగారు.
యాదాద్రి పవర్ ప్లాంట్ అపుతానంటున్న కోమటిరెడ్డిని ప్రజలు చెప్పులతో కొడతారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తొమ్మిదేండ్లయినా నదీ జలాలు పంపిణీ చేసే తీరిక కేంద్రానికి లేదని అన్నారు. అలాంటిది సాగర్ నుంచి మనకు మంచినీరు కావాలంటే త్వరగా ఇస్తుందా ఆలోచన చేయాలని సూచించారు. ఇప్పుడు కాంగ్రెస్ చేతకానితనంతో సాగర్ మన చేతుల్లోంచి వెళ్లిపోయిందని ఫైర్ అయ్యారు.
ఆ పార్టీ నిర్వాకం వల్ల ఈ దుస్థితి వచ్చిందన్నారు. కాంగ్రెస్ వాళ్లకు చిత్తశుద్ధి ఉంటే రేపటి వరకు సాగర్ ప్రాజెక్టును మన పరిధిలోకి తీసుకురావాలని సవాల్ విసిరారు. తెలంగాణకు శ్రీ రామ రక్ష కేసీఆర్ మాత్రమేనని పేర్కొన్నారు. సాగర్ నీళ్ల కోసం కేసీఆర్ పోరాటం మొదలుపెడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ వాళ్లను ఉరికించి కొడతామని హెచ్చరించారు. మన కళ్ల ముందే సాగర్ నీళ్లుపోతుంటే రైతుల కడుపు రగులుతోందన్నారు.
ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి ఇవ్వడమంటే ఆంధ్రాకు నీళ్లు అప్పనంగా రాసి ఇవ్వడమేనని తేల్చి చెప్పారు. అప్పట్లో చంద్రబాబు సాగర్ డ్యామ్‌పై హుషారు చేస్తే కేసీఆర్ తరిమికొట్టారని చెప్పారు. రాష్ట్రంలో ఇక యుద్ధం మొదలు పెడదామన్నారు.. కాంగ్రెస్ వాళ్లను తరిమికొడదామని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎడమ కాల్వ రైతాంగం మళ్లీ తిరోగమనం అయ్యేలా పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు.
సాగర్ డ్యామ్ కేంద్ర బలగాల చేతికిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మనలను అడుగు కూడా పెట్టనియ్యడం లేదన్నారు. ఇది కాంగ్రెస్ చేసిన నిర్వాకమని తీవ్రంగా విరుచుకపడ్డారు. కాంగ్రెస్ తెలివితక్కువ తనంతో కృష్ణా నీళ్లు తరలిపోయాయని ఆరోపించారు. పోలీసులను అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ నేతలు పాలన చేస్తున్నారని నిప్పులు చెరిగారు. చంద్రబాబు బూట్లు నాకేటోళ్లు కాంగ్రెస్ వాళ్లని.. రేవంత్ చంద్రబాబు శిష్యుడని.. అందుకే ఈ దుస్థితి వచ్చిందన్నారు.