Telugu News » DELHI METRO : ఢిల్లీ మెట్రోలో రెచ్చిపోయిన యువతులు.. హోలీ ఆడుతూ ముద్దులతో హల్‌చల్!

DELHI METRO : ఢిల్లీ మెట్రోలో రెచ్చిపోయిన యువతులు.. హోలీ ఆడుతూ ముద్దులతో హల్‌చల్!

దేశ రాజధాని ఢిల్లీ మెట్రోలో (Delhi Metro) ఇటీవల అ సాంఘిక కార్యకలాపాలు (Illegal Activities) క్రమేపీ పెరిగిపోతున్నాయి. అయినప్పటికీ ఢిల్లీ మెట్రో అధికారులు స్పందించడం లేదు. ముఖ్యంగా యువత (Youth) మెట్రోలో చేసే పనులకు తోటి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

by Sai
Excited young women are playing Holi with kisses in Delhi Metro

దేశ రాజధాని ఢిల్లీ మెట్రోలో (Delhi Metro) ఇటీవల అ సాంఘిక కార్యకలాపాలు (Illegal Activities) క్రమేపీ పెరిగిపోతున్నాయి. అయినప్పటికీ ఢిల్లీ మెట్రో అధికారులు స్పందించడం లేదు. ముఖ్యంగా యువత (Youth) మెట్రోలో చేసే పనులకు తోటి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రయాణికులు అందరూ చూస్తుండగానే కౌలిగించుకోవడం, ముద్దులు పెట్టుకోవడం పరిపాటిగా మారిపోయింది. యువతీయువకులు చేస్తున్న వికృత చేష్టలకు సంబంధించి పలు వీడియోలు నెట్టింట్ వైరల్ అవుతున్నాయి.

Excited young women are playing Holi with kisses in Delhi Metro

ఈ మధ్యకాలంలో ఇటువంటి ఘటనలు చాలా పెరిగిపోయాయి. మెట్రో స్టేషన్ ఆవరణతో పాటు రన్నింగ్ ట్రెయిన్ లోనూ యువతీ యువకుల రొమాన్స్‌కు అడ్డు అదుపు లేకుండా పోయింది. కొన్ని సార్లు ప్రయాణికులు వద్దని వారించినా యువతులు వారితో గొడవకు దిగిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఓపెన్ స్పెస్ , ఫ్రీడమ్ పేరుతో ఢిల్లీ యువత, ప్రేమ పక్షులు బాహ్య ప్రపంచాన్నే మరిచిపోతున్నారు.

తాము ఎక్కడ ఉన్నాం. ఏం చేస్తున్నాం. తమను ఎవరైనా చూస్తున్నారా? ఫోటోలు, వీడియోలు తీస్తున్నారా? ఈ విషయం తమ ఇంట్లో వాళ్ల వరకు వెళితే ఏం జరుగుతుంది? పరువు ప్రతిష్టల గురించి నేటితరం అస్సలు ఆలోచించడం లేదని ఇటువంటి ఘటనలకు సంబంధించిన వీడియో వైరల్ అయినపుడు స్పష్టంగా అర్థమవుతోంది.

తాజాగా ఇద్దరు యువతులు హోలీ థీమ్‌తో మెట్రోలో వేసిన వేషాలు పెద్దఎత్తున విమర్శలకు దారితీస్తోంది. రన్నింగ్ మెట్రోలో కింద కూర్చుని ఓ డ్యూయెట్‌‌కు యాక్ట్ చేస్తూ ఇన్ స్టాగ్రామ్ రీల్స్ చేశారు. ఓ యువతి మరో యువతికి రంగులు పూయడంతో పాటు ముద్దులు పెడుతూ రొమాంటిక్ యాంగిల్ ప్లే చేసింది. తోటి ప్రయాణికులు వారిని చూసి కూడా చూడనట్టు వ్యవహరించారు. ఆ యువతులకు సంబంధించి వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

 

You may also like

Leave a Comment