Telugu News » Tiger killer : ఆ రైతు రెండు పులులను చంపేశాడు…ఎలాగంటే..!?

Tiger killer : ఆ రైతు రెండు పులులను చంపేశాడు…ఎలాగంటే..!?

తమిళనాడు(Tamil Nadu)లోని నీలగిరి జిల్లాలో ఓ వ్యక్తి రెండు పులుల మృతికి కారణమైనట్లు అధికారులు అనుమానిస్తున్నారు.ఈ మేరకు అటవీ అధికారులు శేఖర్‌ అనే రైతును అదుపులోనికి తీసుకున్నారు.

by sai krishna

తమిళనాడు(Tamil Nadu)లోని నీలగిరి జిల్లాలో ఓ వ్యక్తి రెండు పులుల మృతికి కారణమైనట్లు అధికారులు అనుమానిస్తున్నారు.ఈ మేరకు అటవీ అధికారులు శేఖర్‌ అనే రైతును అదుపులోనికి తీసుకున్నారు.

ఎమరాల్డ్‌(Emerald)లోని నీటి కుంటలో 3 ఏండ్లు, 8 ఏండ్ల వయసున్న రెండు పులులు మృతి చెందినట్లు గుర్తించి..దీనిపై విచారణ చేపట్టారు. పులుల కళేబరాలకు సమీపంలోనే ఓ ఆవు కళేబరాన్ని గమనించారు.

దీంతో అనుమానం వచ్చిన అధికారులు ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం పులులు, ఆవు కళేబరాల నుంచి నమూనాలను సేకరించి కోయంబత్తూరుకు పంపారు అధికారులు.

కళేబరాలలో పురుగుల మందు అవశేషాలు ఉన్నట్టు నివేదిక వచ్చింది. విషపూరితమైన ఆవు కళేబరాన్ని తినడం వల్లే పులులు చనిపోయినట్టు ఫోరెన్సిక్‌ నివేదికలో తేలింది.

ఈ క్రమంలో సోమవారం ఆవు యజమాని శేఖర్‌(Shekhar)ను అటవీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారించారు. తానే ఆవు కళేబరాన్ని విషపూరితం చేసినట్టు శేఖర్‌ అంగీకరించాడు.

పది రోజుల కిందట తప్పిపోయిన తన ఆవును వెతకడానికి సమీపంలోని అడవికి వెళ్లానని, ఓ చోట ఆవు మృతదేహం కనిపించిందని, దానిని పులి చంపినట్లు గ్రహించానని తెలిపాడు.


తన ఆవును చంపిన పులిపై ప్రతీకారం తీసుకోవాలని భావించి.. పురుగు మందులతో దాని మృతదేహాన్ని విషపూరితం చేసినట్టు వివరించాడు. చనిపోయినవాటిలో ఒక పులి శరీరంపై ఎటువంటి గాయాలు కనిపించకపోగా.. మరొకటి గాయపడినట్లు అధికారులు తెలిపారు.

విషపూరిత ఆవు కళేబరాన్ని తిని కనీసం రెండు పులులలో ఒకటి మరణించి ఉండచ్చని అధికారులు భావిస్తున్నారు.మరో పులి ఎలా చనిపోయిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు.

అయితే, విషపూరిత కళేబరాన్ని తినడానికి ముందు మూడేళ్ల వయసున్న పులిని ఎనిమిదేళ్ల వయసున్న పులి చంపేసి ఉంటుందని భావిస్తున్నారు. గాయాలున్న పులి మరణానికి కచ్చితమైన కారణాలు ఫోరెన్సిక్ నిపుణుల(Forensic experts)విశ్లేషణ తర్వాత వెల్లడవుతుందని అన్నారు.

You may also like

Leave a Comment