రాజస్థాన్‌లో (Rajasthan) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సికార్ (Sikar) జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలు అయినట్టు సమాచారం.. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మరోవైపు శ్రీమాధో పూర్‌లో కారు-బస్సు ఢీకొని నలుగురు మృతి చెందారు. బస్సును ఢీకొనడంతో కారు నుజ్జునుజ్జయిందని సమాచారం..
ప్రమాద వివరాలని వెల్లడించిన ఏఎస్ఐ కౌలాస్ చంద్ గుర్జార్.. మూడు మృతదేహాలు మార్చురీలో ఉన్నాయని.. మరో వ్యక్తిని ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించాడని తెలిపారు.. మరోవైపు మంచిర్యాల (Manchryala) జిల్లా లక్షెట్టిపేట (Luxettipet) ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రాంగణంలో నిర్వహిస్తున్న హైస్కూల్ తరగతి గదుల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోంది.
రేకుల షెడ్లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో.. తరగతి గదుల్లోని ఫర్నిచర్ ఆహుతైందని సమాచారం.. కాగా నిన్న సెలవు రోజు కావడంతో విద్యార్థులకు ముప్పు తప్పింది.. ప్రమాద విషయం తెలుసుకొన్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్టు సమాచారం. అయితే ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్లే జరిగిందా, లేదంటే వేరే కారణం ఏదైనా ఉందా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నట్టు తెలుస్తోంది..