డాక్టర్ హోమీ జహంగీర్ బాబా (Homi Jahangir Baba)… భారత అణు శక్తి పితా మహుడు. అణుశక్తి రంగంలో అగ్రరాజ్యాలకు ధీటుగా భారత్ (India) నేడు నిల్చుందంటే దానికి ఆయన ఆలోచనల పుణ్యమే. అణుశక్తిని వద్దంటూ ప్రపంచ దేశాలు వారిస్తున్న సమయంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని భారత్‌ను అణు శక్తి దేశంగా తీర్చిదిద్దే ప్రయత్నాలు చేసిన గొప్ప శాస్త్రవేత్త ఆయన.
30 అక్టోబర్ 1909న డాక్టర్ హోమీ జహంగీర్ బాబా ముంబైలోని ఒక పార్సీ కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి జహంగీర్ హోర్ముస్జీ బాబా, తల్లి మెహెర్బాయి టాటా. బాబా తన ప్రాథమిక విద్యను ముంబైలో పూర్తి చేశారు. అనంతరం ఉన్నత విద్య కోసం లండన్ వెళ్లారు. 1930లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో పట్టభద్రుడయ్యాడు.
ఇంజనీరింగ్ అనంతరం ఆయనకు భౌతిక శాస్త్రంపై ఆసక్తి పెరిగింది. అనంతరం కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో భౌతిక శాస్త్రాన్ని అభ్యసించడానికి అమెరికా వెళ్ళే ముందు. ఇంజినీరింగ్ తర్వాత భౌతికశాస్త్రంపై ఆసక్తి పెరిగింది. 1935లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుండి న్యూక్లియర్ ఫిజిక్స్‌లో.పీహెచ్డీ పూర్తి చేశారు.
1939లో భారత్ కు తిరిగి వచ్చాడు. అప్పుడే రెండో ప్రపంచ యుద్ధం మొదలు కావడంతో భారత్ లోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. అప్పుడే అణుశక్తి అవసరాలను గుర్తించి భారత్‌లో అణుశక్తి కమిషన్ ఏర్పాటు కోసం అప్పటి ప్రధాని జవహార్ లాల్ నెహ్రూను ఒప్పించారు. ఆ తర్వాత దేశంలో తొలి అణుశక్తి రియాక్టర్ ‘అప్సర’ఆయన నేతృత్వంలోనే రూపు దిద్దుకుంది.
ఆయన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం 1954లో ఆయన్ని పద్మ భూషణ్ అవార్డుతో సత్కరించింది. ఆ తర్వాత 1959లో భారత రెండో అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డును ఆయనకు ప్రధానం చేసింది. 24 నవంబర్ 1966లో స్విస్ లో జరిగిన విమాన ప్రమాదంలో ఆయన మరణించారు.