Telugu News » So Sad: కూతురు బతికుండగానే పెదకర్మ చేసిన తండ్రి..!

So Sad: కూతురు బతికుండగానే పెదకర్మ చేసిన తండ్రి..!

కూతరు తన మాటకాదని ప్రేమ పెళ్లి చేసుకుందని ఓ తండ్రి కోపం కట్టలు తెంచుకుంది. తమను కాదనుకున్న కూతుర్ని తనూ కాదనుకున్నాడు.

by sai krishna

కూతరు తన మాటకాదని ప్రేమ పెళ్లి చేసుకుందని ఓ తండ్రి కోపం కట్టలు తెంచుకుంది. తమను కాదనుకున్న కూతుర్ని తనూ కాదనుకున్నాడు. ఇంతకాలం మమకారం పెంచుకున్న కూతురికి బతికి ఉండగానే పెద్దకర్మ నిర్వహించి తన ఆక్రోశాన్ని వెళ్లబుచ్చుకున్నాడు.


ఈ వింత ఘటన నిజామాబాద్‌(Nizamabad)లో జరిగింది. తన కూతురు గత కొంతకాలంగా ఒక వ్యక్తిని ప్రేమిస్తోంది. ఇటీవల అతడితో వెళ్లిపోయింది. దీంతో కూతురుపై కోపం పెంచుకున్న మహేశ్(Mahesh)..ఇలా బతికుండగానే పెద్దకర్మ చేశాడు.

అంతేకాదు తన కూతురు చనిపోయిందని వెల్లడిస్తూ ఒక ఫ్లెక్సీని సైతం ఏర్పాటు చేశాడు. 10-09-2023న మరణించిందంటూ ఫ్లెక్సీలో పేర్కొన్నాడు. కొన్నాళ్ల క్రితం మహేశ్ దంపతులు ఆమెకు ఘనంగా పెళ్లి చేశారు.

తర్వాత ఆమె భర్తకు బోన్ క్యాన్సర్(Bone cancer)అని తెలియడంతో అతడిని వదిలేసి ఆమె పుట్టింటికి వచ్చేసింది.ఈ క్రమంలో మహేశ్ కూతురికి ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో ఇటీవల ఇద్దరూ కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయారు.

తమకు చెప్పకుండా ప్రేమికుడితో వెళ్లిపోయినందుకు కూతురిపై మహేశ్ విపరీతమైన కోపం పెంచుకున్నాడు. దీంతో ఇలా ఫ్లెక్సీ ఏర్పాటు చేసి మరీ కూతురు బతికుండగానే పెద్ద కర్మ చేయడం స్థానికంగా కలకలం రేపుతోంది.

You may also like

Leave a Comment