Telugu News » Yummy CM : సర్కార్ బడి పిల్లలకు ‘సీఎమ్ బ్రేక్ ఫాస్ట్’..టీగవర్నమెంట్ దసరా కానుక..!

Yummy CM : సర్కార్ బడి పిల్లలకు ‘సీఎమ్ బ్రేక్ ఫాస్ట్’..టీగవర్నమెంట్ దసరా కానుక..!

తెలంగాణ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కేసీఆర్ ప్రభుత్వం దసరా కానుక(Dussehra gift)ను తెరమీదికి తెచ్చింది.వచ్చే దసరా పండగ నుంచి విద్యార్థులకు కొత్త పథకాన్ని అమలు చేయబోతోంది.

by sai krishna

తెలంగాణ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కేసీఆర్ ప్రభుత్వం దసరా కానుక(Dussehra gift)ను తెరమీదికి తెచ్చింది.వచ్చే దసరా పండగ నుంచి విద్యార్థులకు కొత్త పథకాన్ని అమలు చేయబోతోంది.

దసరా పండుగ సంధర్భంగా అక్టోబరు 24 నుంచి పాఠశాలల్లో ముఖ్యమంత్రి అల్పాహార పథకం ప్రారంభించనున్నారు. ప్రభుత్వ ప్రాథమిక,ఉన్నత పాఠశాలల్లో సీఎమ్ అల్పాహార పథకం(CM Breakfast Scheme)దసరా రోజున లాంఛనంగా ప్రారంభిస్తారు.

1 నుంచి 10వ తరగతుల వరకు ఈ పథకాన్ని వర్తింపజేయనుంది. విద్యార్థులకు బోధనతో పాటు మంచి పోషకాహారాన్ని అందించే దిశగా అడుగులు వేస్తున్నట్లు ప్రభుత్వం ఈ సరికొత్త ప్రకటన చేసింది. ఉదయాన్నే విద్యార్థుల తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు, కూలీ పనులు చేసుకోవడానికి వెళ్లిపోతారు.

అందువల్ల వారు ఉదయం అల్పాహారం విషయంలో చాలా ఇబ్బందులు పడి..తగిన ప్రోటీన్ ఆహారం(Protein food)అందక అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని తెలుసుకొని.. సీఎం కేసీఆర్ ఈ పథకానికి రూపకల్పన చేశారు.

సీఎం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. కొత్త పథకంతో ప్రభుత్వ ఖజానాపై ఏటా రూ.400 కోట్ల అదనపు భారం పడనుందని ప్రభుత్వ వర్గాలు తెలుపుతున్నాయి.

ప్రభుత్వానికి భారమైన ఈ పథకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దసరా పండగ రోజు ప్రారంభించాలని సీఎం సంకల్పించారు. తమిళనాడు(Tamil Nadu)లో ఇప్పటికే ఈ అల్పాహార పథకం అమలు అవుతుంది.

విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా, వారి ఆరోగ్యం గురించి కూడా మంచిగా ఉపయోగపడుతోందని తెలిసి..సీఎం కేసీఆర్ రాష్ట్ర ఉన్నతాధికారులను చెన్నై వెళ్లి పరిశీలించమని ఆదేశించారు.ఈ పథకం అమలు తీరుపై పరిశీలనకు వెళ్లిన అధికారులు.. పూర్తిస్థాయిలో ఎలా అమలు చేస్తున్నారు వంటి వాటిని తెలుసుకున్నారు.

ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితాసభర్వాల్(Smita Sabharwal), ప్రభుత్వ గిరిజన సంక్షేమ సాఖ కార్యదర్శి క్రిస్టినా చొంగ్తూ(Christina Chongtoo), సీఎం పేషీ అధికారిని ప్రియాంక వర్ఘీస్, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ(Vakati karuna), మహిళలు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్ల శాఖ ప్రత్యేక కార్యదర్శి భారతి హొళికేరి తదితరులు చెన్నైలోని రాయపురంలోని వంటశాలను సందర్శించారు.

అల్పాహారం తయారీకి కావాల్సిన సామాగ్రి, పాఠశాలలకు తరలింపును తెలుసుకుని రుచి చూశారు. అనంతరం రాయపురం ఆరత్తూన్ రోడ్డులోని కార్పొరేషన్ ఉర్దూ పాఠశాలకు చేరుకుని విద్యార్థులకు ఎలా పంపిణీ చేస్తున్నారో తెలుసుకున్నారు. ఆ అల్పాహారం నాణ్యత, పంపిణీని పరిశీలించారు.

ఈ పథకం వల్ల ఎంతమంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు అనే విషయాన్ని అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. వారి తల్లిదండ్రుల నుంచి ఎలాంటి స్పందన వస్తోందని కూడా ఉపాధ్యాయులను, ఈ పథకం సమన్వయ అధికారి ఇళమ్ భగవత్( Ilam Bhagwat)ను అడిగి తెలంగాణ రాష్ట్ర ఉన్నతాధికారులు తెసుకున్నారు.

అక్కడ కేవలం ప్రాథమిక పాఠశాలలో మాత్రమే అమలు చేస్తున్నారు. కానీ తెలంగాణలో ప్రాథమిక పాఠశాలలతో పాటు ఉన్నత పాఠశాలల్లోనూ అమలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.

You may also like

Leave a Comment