Telugu News » Andhra Pradesh : మత మార్పిడులపై పోరాటం..!

Andhra Pradesh : మత మార్పిడులపై పోరాటం..!

ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి విపరీతమైన మతమార్పిడిలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు.

by Venu

హిందూ ధర్మంపై పకడ్బందీగా కుట్రలు జరుగుతున్నాయని ధార్మిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పురాతన సంప్రదాయాలకు తిలోదకాలు ఇచ్చేలా చేయించి భ్రష్టు పట్టిస్తున్నారని.. ఇది ఏ మాత్రం మంచిది కాదని చెబుతున్నారు. ముఖ్యంగా మత మార్పిడులను ప్రోత్సహిస్తోన్న వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే.. ఎంతోమందిని తిరిగి హిందూ ధర్మంలోకి వచ్చే విధంగా ప్రోత్సహిస్తున్నారు.

 

శ్రీశైలం (Srisailam) మహా పుణ్యక్షేత్రంలో ఆధ్యాత్మిక వేత్త, బ్రహ్మర్షి సామవేదం షణ్ముఖ శర్మ వందలాది దళిత గిరిజన విద్యార్థులకు భగవద్గీతను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ధర్మ పరిరక్షణ సమితి కార్యదర్శి, స్వర్ణయుగ సేవా ట్రస్టు చైర్మన్ దర్శనపు శ్రీనివాస్ (Darshanpu Srinivas) పాల్గొన్నారు. మత మార్పిడుల విషయంలో ఎంతగానో ఆవేదన చెందారు.

దేవాలయ వ్యవస్థ మీద ఆంధ్రప్రదేశ్ (Andra pradesh) లో కుట్రలు జరుగుతున్నాయని చెప్పారు. ఇలాంటి వాటికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని… ముఖ్యంగా అమాయకులైన హిందూ దళిత గిరిజన వర్గాలపై, డేగ కన్నేసిన విదేశీ ముఠా నుండి అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఇలాంటి ధర్మ కార్యక్రమాలు చేయడం ద్వారా దళిత, గిరిజన వర్గాల్లో హిందుత్వంపై నమ్మకం పెరుగుతుందని ఆధ్యాత్మిక వేత్తలు తెలిపారు. క్షేత్రస్థాయిలో పనిచేసే వ్యక్తులు మాత్రమే హిందూ ధర్మాన్ని కాపాడుతారని చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని.. ముఖ్యంగా మతం మారినవారు వెనక్కి రావాలని శ్రీనివాస్ కోరారు.

You may also like

Leave a Comment