కుత్బుల్లాపూర్(Kutbullapur) జీడిమెట్ల పోలీస్ స్టేషన్ (Jeedimetla Police Station) పరిధిలో ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు(Private travel bus) దగ్ధమైంది. పార్కింగ్ ఏరియాలో ఆగి ఉన్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలతో పాటు పొగలు భారీగా వ్యాపించాయి.

దీంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. బస్సు పక్కన ఉన్న మరో రెండు బస్సులకు మంటలు వ్యాపించడంతో ఆ బస్సుల బయట భాగం కొంతవరకు మంటల్లో దగ్ధమయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తున్నారు. ఘటనాస్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.