Telugu News » Iraq : వివాహ వేడుకలో అగ్నిప్రమాదం…113 మంది మృతి

Iraq : వివాహ వేడుకలో అగ్నిప్రమాదం…113 మంది మృతి

ఈ ఘటన ఉత్తర ఇరాక్ అల్-హమానియా ప్రాంతంలో జరిగినట్లు స్థానిక పోలీసులు, అత్యవసర సర్వీసుల విభాగం తెలిపింది.

by Prasanna
fire

ఇరాక్ (Iraq) లో తీవ్ర విషాదం నెలకొంది. పెళ్లి వేడుక (Marriage Celebrations) జరుగుతున్న ఓ ఫంక్షన్ లో ఘోర అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. ఈ ప్రమాదంలో వివాహానికి హాజరైన వారిలో 113 మందికి పైగా మృతి చెందారు. మరో 150 మందికి పైగా అతిథులు గాయపడ్డట్లు అక్కడి మీడియా వర్గాలు వెల్లడించాయి. గాయపడిన వారిలో నూతన వధూవరులు కూడా ఉన్నట్లు సమాచారం.

fire

ఈ ఘటన ఉత్తర ఇరాక్ అల్-హమానియా ప్రాంతంలో జరిగినట్లు స్థానిక పోలీసులు, అత్యవసర సర్వీసుల విభాగం తెలిపింది. ఈ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనపై  డిప్యూటీ గవర్నర్ హసన్ ఇరాక్ మీడియాతో మాట్లాడారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం ఈ ఘటన ఇరాక్ స్థానిక సమయం ప్రకారం మంగళవారం రాత్రి 10.45 జరిగిందని తెలిపారు.

మృతుల సంఖ్యపై ఇంకా స్పష్టత రాలేదని, ప్రస్తుతానికి 113 మంది మరణించారని, ఇది ఇంకా పెరిగే అవకాశముందని డిప్యూటీ గవర్నర్ తెలిపారు. ఈ సంఘటన దురదృష్టకరమని ఇరాక్ ఆరోగ్యశాఖ మంత్రి సైఫ్ ఆల్ బాద్ర్ అన్నారు.

ఈ ప్రమాదానికి వివాహ వేడుకలో జరిగిన ఫైర్ వర్క్స్ కారణమని ప్రాధమిక విచారణలో తేలిందని ఇరాక్ ఫైర్ డిపార్ట్ మెంట్ తెలిపింది.

You may also like

Leave a Comment