తమిళనాడు (Tamilnadu)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తిరుపూరు జిల్లా ధారాపురం (Dharampuram)లో కారును ఓ ట్రక్కు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు మరణించారు. సమచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుకు కారులో కొందరు వ్యక్తులు కోయంబత్తూరులోని పెరియనాయకన్ పాలెం నుంచి దిండిగుల్ జిల్లా పలనీ గ్రామానిక వెళ్తున్నారు. అదే సమయంలో కొయంబత్తూరు జిల్లా నుంచి పెట్రోల్‌తో ట్రక్కు ఎదురుగా వస్తోంది. ధారాపురం-పలనీ రహదారిపై మనకడావ్ ప్రాంతంలో కారును ట్యాంకర్ ఢీ కొట్టింది.
ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో వ్యక్తి మరణించినట్టు అధికారులు తెలిపారు. దీంతో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. మృతులను తమిళ్ మణి (51), చిత్ర (49), సెల్వరాణి (70), బాలకృష్ణన్ (78), కళారాణి (50) గా పోలీసులు గుర్తించారు.
ధారాపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందతూ కళారాణి మృతి చెందారని వెల్లడించారు. ఘటనపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబానకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.