Telugu News » మా సాయం ఎక్కడ సారు…?

మా సాయం ఎక్కడ సారు…?

ఫర్ గెట్ ఫ్లడ్ ఫేవర్

by sai krishna

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మోరంచపల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.తమకు ప్రకటించిన వరదబాధిత తక్షణ సాయం.. తక్షణమే అందించాలని బాధితులు డిమాండ్ చేశారు.ప్రభుత్వం ఇస్తానన్న రూ. లక్ష ఇచ్చేదాకా ఆందోళన కొనసాగుతుందని ధర్మసమాధి పార్టీ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.

ఆందోళన చేస్తున్న నాయకులను పోలీసులు అరెస్టు చేసే ప్రయత్నం చేయగా, గ్రామస్తులు అడ్డుకున్నారు. జిల్లా కలెక్టర్‌ను సస్పెండ్ చేయాలని, పోలీస్ జులుమ్ నశించలంటూ నినాదాలు చేశారు. రాస్తారోకో వల్ల సుమారు పది కిలోమీటర్ల మేర గంట సమయం వరకు వాహనాలు నిలిచిపోయాయి.

దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.స్పందించిన జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు …సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చి రాస్తారోకోను విరమింపజేశారు.


ఈ సందర్భంగా ధర్మ సమాజ్ పార్టీ నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితులను ఆదుకోవడంలో విఫలమైందని, ఇప్పటి వరకు మహాలక్ష్మి అనే మహిళ మృతదేహం లభించలేదని, వరద బాధితులకు పదివేల రూపాయలు ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుందన్నారు.

వరద విపత్తును ముందుగా గమనించని జిల్లా కలెక్టర్ ను వెంటనే ప్రభుత్వం సస్పెండ్ చేయాలని, వరద ప్రభావిత ప్రాంతాలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. వరద బాధితులకు లక్ష రూపాయల సహాయం అందించాలని, లేనియెడల ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

You may also like

Leave a Comment