Telugu News » India Alliance : ప్రధాని అభ్యర్థిగా ఖర్గే… దీదీ అలా అనలేదంటూ కాంగ్రెస్ నేత ట్విస్ట్….!

India Alliance : ప్రధాని అభ్యర్థిగా ఖర్గే… దీదీ అలా అనలేదంటూ కాంగ్రెస్ నేత ట్విస్ట్….!

మొత్తం 8 నుంచి పది సమావేశాలు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.

by Ramu
karge

విపక్ష ‘ఇండియా కూటమి’ (India Alliance)నాల్గవ సమావేశం (Meeting) ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశానికి విపక్ష పార్టీలు హాజరయ్యాయి. మొత్తం 28 పార్టీలు ఈ సమావేశానికి హాజరయ్యాయి. మొత్తం 8 నుంచి పది సమావేశాలు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. విపక్ష ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా ఖర్గే పేరును బెంగాల్, ఢిల్లీ సీఎంలు మమతా బెనర్జీ, కేజ్రీవాల్ ప్రతిపాదించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

Focus on Winning First Mallikarjun Kharge On His Name Being Proposed for PM Face

కానీ మల్లికార్జున ఖర్గే పేరును దీదీ నేరుగా ప్రస్తావించలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దళిత సామాజిక వర్గానికి చెందిన నేత పీఎం అభ్యర్థిగా ఉంటే బాగుంటుందని మాత్రమే ఆమె చెప్పారని అంటున్నాయి. దీంతో కాస్త గందరగోళం నెలకొంది. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో విపక్ష కూటమి విజయమే ప్రధానమని ఖర్గే అన్నారు. మిగిలిన విషయాలన్నింటినీ ఎన్నికల తర్వాత చూసుకోవచ్చని ఖర్గే వెల్లడించారు.

దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడలంటే విపక్షాలన్నీ కలిసి ఉమ్మడి పోరు చేయాలని నిర్ణయించామన్నారు. పార్లమెంట్‌లో ఎంపీల సస్పెన్షన్ గురించి ఈ సమావేశంలో చర్చించినట్టు తెలిపారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు విపక్ష పార్టీలు పోరాటం చేయాలన్నారు. అందుకోసం అన్ని పార్టీలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. పార్లమెంట్ భద్రతా లోపం ప్రధాని మోడీ లేదా కేంద్ర హోం మంత్రి అమిత్ షాలు సభలో ప్రకటన చేయాలన్నామన వెల్లడించారు.

141 మంది ఎంపీలను సస్పెండ్ చేయడం ఇదే తొలిసారి అని ఖర్గే తెలిపారు. ఇది సరైన నిర్ణయం కాదన్నారు. దీనికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామన్నారు. ఎంపీల సస్పెన్షన్ కు వ్యతిరేకంగా ఈ నెల 22న నిరసన చేపడతామన్నారు. సీట్ల సర్దుబాటు గురించి రాష్ట్ర స్థాయిలో చర్చలు జరుపుతామని అన్నారు. ఒక వేళ ఏదైనా సమస్య తలెత్తినప్పుడు దానిపై జాతీయ స్థాయిలో చర్చిస్తామన్నారు.

మరోవైపు విపక్షాల ప్రధాని అభ్యర్థిగా ఖర్గే పేరును మమతా బెనర్జి ప్రస్తావించారని వస్తున్న వార్తలపై కేరళ కాంగ్రెస్ నేత పీసీ థామస్ కీలక వ్యాఖ్యలు చేశారు. మమతా బెనర్జీ ఖర్గే పేరు ప్రస్తావించలేదని తెలిపారు. విపక్ష కూటమి ప్రధాని అభ్యర్థిగా దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ప్రకటిస్తే బాగుంటుందని ఆమె ప్రతిపాదన చేశారని తెలిపారు. అంతే కానీ ఖర్గే పేరును ప్రతిపాదించలేదని స్పష్టం చేశారు.

మరోవైపు ఇది నాల్గవ ఫోటో సెషన్ అంటూ విపక్ష ఇండియా కూటమి సమావేశంపై బీజేపీ నేత, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ సెటైర్లు వేశారు. ఈ ఫోటో సెషన్ కు బిహార సీఎం నితీశ్ కుమార్, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ హాజరు కూడా కాలేదన్నారు. ఆ ఫోటో షూట్ ను వాళ్లు బాయ్ కాట్ చేశారని అన్నారు. ఇండియా కూటమి ఫెయిల్ అవుతుందన్నారు.

 

You may also like

Leave a Comment