భువనగిరి సోషల్ వెల్పేర్ రెసిడెన్షియల్ స్కూల్(Bhuvanagiri Social Welfare Residential School)లో ఫుడ్ పాయిజన్(Food poisoning) ఘటనలో విషాదం మిగిలింది. అస్వస్థతకు గురైన విద్యార్థులను హైదరాబాద్ (Hyderabad)లోని నిలోఫర్ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్న విషయం తెలిసిందే.
అయితే చికిత్స పొందుతున్న విద్యార్థుల్లో ఓ బాలుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. అల్పాహారంలో భాగంగా పులిహోర తిన్న తర్వాత 24మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఆ వెంటనే కొందరు చిన్నారులను భువనగిరి ఏరియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న వారిని హైదరాబాద్‌కు తరలించారు.
పోచంపల్లి మండలం(Pochampally Mandal) జబ్లక్పల్లి(Jablakpally)కి చెందిన చిన్నలచ్చి ప్రశాంత్(Chinnalachi Prashanth) అనే విద్యార్థి హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో మంగళవారం రాత్రి చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈనెల 12వ తేదీన సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో ఫుడ్‌పాయిజన్ కాగా పలువురు విద్యార్థులు తీవ్రంగా అస్వస్థతకు గురయ్యారు.
ఇందులో ప్రశాంత్‌తో పాటు మరో విద్యార్థి పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని నిలోఫర్ హాస్పిటల్‌కి తరలించారు. వీరి ఆరోగ్య పరిస్థితిని ఆరా తీసిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని జూబ్లీహిల్స్‌లోని మరో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో చికిత్స పొందుతున్న ప్రశాంత్ మృతి చెందాడు. ప్రశాంత్ మృతితో స్వగ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.