పెళ్లి అంటే మూడు ముళ్ళు.. ఏడడుగులు.. అగ్ని సాక్షిగా వేదమంత్రాలు.. మొత్తం కలిసి నూరేళ్ళ పంట.. ఇది ఒకప్పటి మాట.. ఇప్పుడు పెళ్ళంటే నూరేళ్ళ పంట కాదు.. తాళి పవిత్రతకు పెద్దగా అర్ధం లేదు. కాపురంలో ఏదైనా సమస్య వస్తే ఎన్నాళ్ళు కాపురం చేశామన్నది ఆలోచించకుండా చంపుకోవడమే పరిష్కారంలా ప్రవర్తిస్తున్నారు. హత్యా నేరంలో ఇరుక్కొన్నాక వచ్చే కష్టాల గురించి భయం లేకుండా ప్రవర్తిస్తున్నారు. కాగా తప్పు చేశాడానే కోపంతో ఓ భార్య అతి కిరాతకంగా కట్టుకొన్న భర్త ను చంపిన ఘటన పెద్దపల్లి (Peddapalli) జిల్లాలో చోటు చేసుకోంది.
గోదావరిఖని (Godavarikhani) మార్కండేయ కాలనీ (Markandeya Colony)కి చెందిన కొప్పెర ప్రవీణ్ విలేకరిగా ప్రస్థానాన్ని ప్రారంభించి, రియల్ ఎస్టేట్ వ్యాపారిగా, బిల్డర్ గా ఎదిగాడు. ఈ క్రమంలో ఒక మహిళలతో ప్రవీణ్ కు వివాహేతర సంబంధం ఏర్పడడం దంపతుల మధ్య కలహానికి దారి తీసింది. ఈ నేపథ్యంలో మద్యంకు బానిసైన ప్రవీణ్.. రోజు మద్యం సేవించి ఇంటికి రాగా గొడవలు జరిగేవి. ఓపిక నశించిన భార్య లలిత, ప్రవీణ్ వద్ద సెంట్రింగ్ పనిచేసే మచ్చ సురేష్ తో, భర్త పోరు నుండి తనకు విముక్తి కలిపించాలని ప్రాధేయపడింది.
ముందుగా అంగీకరించని సురేష్ కు ప్లాట్ ఆశను చూపి చివరికి ఒప్పించింది. ముందుగా భర్తకు ఊపిరాడకుండా చేసి చంపాలని నిర్ణయించుకొన్నారు. ఒకవేళ ప్రవీణ్ ప్రతిఘటిస్తే పాముతో కాటేసి హత్య చేయాలని ప్లాన్ వేశారు. సతీష్, మాస శ్రీనివాస్, భీమ గణేష్ లతో కలిసి పతకం రచించాడు. పాముతో కాటేయించాలనే పథకం మేరకు మందమర్రి కి చెందిన ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ నన్నపురాజు చంద్రశేఖర్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఈ క్రమంలో వీరి ఖర్చులకోసం లలిత 34 గ్రాముల బంగారు గొలుసు నజరానగా ఇచ్చింది. మొత్తానికి భార్య సమక్షంలో సురేష్, ప్రవీణ్ ముఖ్యం పై దిండుతో అదిమి ఊపిరి ఆడకుండా చేయగా, మిగితా మిత్రులు కాళ్ళను పట్టుకొన్నారు. ప్రవీణ్ చనిపోయాడో లేదో అన్న సందేహంతో పాముతో కూడా కాటు వేయించారు. అనంతరం చనిపోయాడని నిర్దారించుకున్నాక అక్కడ నుండి వెళ్లిపోయారు.