తెలంగాణలో కాంగ్రెస్(Congress) పార్టీ అధికారంలోకి వచ్చాక కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్న విషయం తెలిసిందే. అయితే, అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలపై ప్రస్తుతం రాష్ట్రంలో పెద్ద ఎత్తున రచ్చ నడుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల(Parliament Elections) నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ పార్టీ హామీల వైఫల్యంపై ప్రధానంగా ఫోకస్ చేశారు.
దీంతో రేవంత్ రెడ్డి(Cm Revanth Reddy) సర్కార్ మరోసారి ఆరు గ్యారెంటీలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. తాజాగా అంగన్ వాడీ సిబ్బంది(Anganwadi Staff)కి శుభవార్త రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
అంగన్ వాడీ కేంద్రాల్లో టీచర్లు, సహాయకులకు పదవీ విరమణ వయసు 65ఏళ్లుగా నిర్ణయించింది. ఈ మేరకు సంబంధిత డిటేల్స్ పంపాలని మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కాంతి వెస్లీ ఆదేశించారు. సిబ్బంది పుట్టిన తేదీని స్కూల్ బొనఫైడ్ ధృవపత్రం లేదా ట్రాన్సర్ సర్టిఫికెట్(టీసీ) లేదా మార్క్ మెమో ప్రకారం గుర్తించాలని సూచించారు.
ఇవేవి లేకుంటే వైద్య ధృవీకరణ పత్రం ఇవ్వాలని కోరింది. సంబంధిత వివరాలను ఏప్రిల్ 30 వరకు పంపించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. రిటైర్మెంట్ అయిన అంగన్వాడీ సిబ్బందికి ప్రభుత్వం ఆసరా ఫించన్లను కూడా మంజూరు చేయనున్నట్లు వెల్లడించింది. అంగన్ వాడీ టీచర్లకు, సహాయకులకు రూ.50వేల చొప్పున ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది