తెలంగాణ రైతాంగానికి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(minister sridher babu) ఎట్టకేలకు శుభవార్త చెప్పారు. ఇంతకాలం రైతులు ఎదురుచూస్తున్న అంశంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు(Farmers) వరి ధాన్యంపై రూ.500 బోనస్ (Bonus) ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజాగా మంత్రి శ్రీధర్ బాబు దీనిపై స్పందించారు. శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన ప్రతి హామీనీ అమలు చేస్తామని, ప్రతీ గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని స్పష్టంచేశారు.
కావాలనే బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ది పొందేందుకు కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతుందని, తమ పార్టీకి ఏకపక్షంగా 12 సీట్లకు పైగానే వస్తాయని మంత్రి శ్రీధర్ బాబు ధీమా వ్యక్తంచేశారు.
అసలు బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు పోటీలోనే లేవని మంత్రి తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ వేగంగా జరుగుతోందని, ఈ కేసులో ఎవరు ఇన్వావ్వ్ అయి ఉన్నా త్వరలోనే వారంతా బయటకు వస్తారని, వారిని జైలుకు పంపిస్తామని మంత్రి స్పష్టంచేశారు. ఇదిలాఉండగా రాష్ట్రంలో కరువు పరిస్థితుల కారణంగా అన్నదాతలు తమ పంటకు నిప్పుపెడుతున్నారు. మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇదే టాపిక్ మీద ప్రతిపక్షాలు అధికార కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేసిన విషయం తెలిసిందే.