తెలంగాణ రైతాంగానికి(Farmers) రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త(Good News) చెప్పింది. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) ఏర్పాటయ్యాక రైతులకు ఇంతవరకు రుణమాఫీ చేయకపోవడంతో రేవంత్ సర్కారుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తున్నాయి. అయితే, రైతులకు రుణమాఫీ(Loan Clear) ఎప్పుడు చేస్తారని ప్రతిపక్ష బీఆర్ఎస్ (BRS) కాంగ్రెస్ సర్కారును టార్గెట్ చేసింది.
ఈ క్రమంలోనే మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupalli krishnarao) రైతులకు తీపి కబురు చెప్పారు. త్వరలోనే రైతులకు రుణమాఫీ చేయనున్నట్లు ప్రకటించారు. ఒకేసారి రూ.2లక్షల మేర రుణమాఫీ చేయనున్నట్లు ప్రకటించారు. అందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు. ప్రతిపక్షాల చెప్పే మాయమాటలు నమ్మవద్దని అన్నదాతలకు హితవు పలికారు.
రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాల కారణంగా పెద్ద మొత్తంలో పంట నష్టపోయిన నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో ఆయన గురువారం పర్యటించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వడగళ్లతో దెబ్బతిన్న పంటపొలాలను పరిశీలించిన అనంతరం మంత్రి జూపల్లి మాట్లాడుతూ..‘ప్రాథమిక అంచనా ప్రకారం
40వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది.
అధికారుల సర్వే పూర్తయ్యాక ఎకరానికి రూ.10వేల నష్టపరిహారం అందిస్తాం. కేసీఆర్ చేసిన రూ.8 లక్షల కోట్ల అప్పులకు గాను ఏటా రూ.60వేల కోట్ల వడ్డీ కట్టాల్సి వస్తోంది’ అని వెల్లడించారు.ఇదిలాఉండగా కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చాక పంటలకు నీరు అందించడం లేదని, రుణమాఫీ, రైతుబంధు,రైతు భీమా, రైతులకు ఉచిత విత్తనాలు, ఎరువులు అందించడం లేదని, జలాశయాల్లో నీరు ఎండిపోతున్నా రేవంత్ సర్కార్ చూసిచూడనట్లు వ్యవహారిస్తోందని బీఆర్ఎస్ పార్టీ నేతలు ఘాటు విమర్శలు చేస్తున్నారు.గత ప్రభుత్వం హయాంలో గతేడాది ఈ సమయానికి కాళేశ్వరం నుంచి నీళ్లు ఎత్తిపోసి ప్రాజెక్టులను నింపామని బీఆర్ఎస్ నేతలు గుర్తుచేస్తున్నారు.