Telugu News » Google Maps: గూగుల్ మ్యాప్స్‌లో మారిన ఇండియా పేరు….!

Google Maps: గూగుల్ మ్యాప్స్‌లో మారిన ఇండియా పేరు….!

ఇప్పుడు గూగుల్ మ్యాప్స్‌లో భారత్ అని టైప్ చేస్తే దక్షిణాసియాలోని ఓ ప్రముఖ దేశం అంటూ సెర్చ్ రిజల్ట్ చూపిస్తోంది.

by Ramu

దేశం పేరును ‘ఇండియా’ నుంచి భారత్‌ (Bharat)గా మారుస్తున్నారంటూ ఇటీవల వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఇండియా కొత్త పేరును గూగుల్ మ్యాప్స్ ( Google Maps) అంగీకరించింది. ఇప్పుడు గూగుల్ మ్యాప్స్‌లో భారత్ అని టైప్ చేస్తే దక్షిణాసియాలోని ఓ ప్రముఖ దేశం అంటూ సెర్చ్ రిజల్ట్ చూపిస్తోంది.

గూగుల్ మ్యాప్స్‌లో భారత్ అని టైప్ చేయగానే వెంటనే ఇండియా మ్యాప్ కు రీ డైరెక్ట్ చేస్తోంది. దీని బట్టి ఇండియాకు అదనంగా భారత్ అనే పేరును కూడా గూగుల్ తన డేటా బేస్‌లో యాడ్ చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఇక నుంచి యూజర్లు ఇండియా లేదా భారత్ ఏ పేరు టైప్ చేసినా ఇండియా మ్యాప్ లోకి వెళ్లి పోవచ్చు.

ఈ ఏడాది జీ-20 సమావేశాల్లో విందు సందర్భంగా అతిథులకు పంపిన ఆహ్వానాల్లో ఇండియాకు బదులు ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ముద్రించారు. దీంతో ఇండియా పేరును మారుస్తున్నట్టు వార్తలు వచ్చాయి. దీనిపై విపక్షాలు మండిపడ్డాయి. దీంతో రాజ్యాంగంలోనే ఇండియా దటీజ్ భారత్ అని రాజ్యాంగ నిర్మాతలు పొందు పరిచారని కేంద్రం క్లారిటీ ఇచ్చింది.

ఆ తర్వాత ఇండియా పేరును భారత్ గా మార్చేందుకు పార్లమెంట్‌లో బిల్ ప్రవేశ పెట్టేందుకు మోడీ సర్కార్ రెడీ అయినట్టు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఇటీవల ఎన్సీఆర్టీఏ పుస్తకాల్లో ఇండియా పేరు బదులుగా ఇక నుంచి భారత్ అని ముద్రించాలని నిర్ణయించింది. తాజాగా దీనిపై దుమారం రేగుతోంది.

You may also like

Leave a Comment