తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)ని గూగుల్ వైస్ ప్రెసిడెంట్ (Google Vice President) చంద్రశేఖర్ తోట (Chandra Shekhar Thota) కలిశారు. సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఆయన్ని తోట చంద్రశేఖర్ కలిశారు. ఈ సందర్బంగా పలు అంశాలపై ఇరువురు మధ్య చర్చ జరిగింది.
తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు చంద్రశేఖర్ సంసిద్ధతను వ్యక్తం చేశారు. వ్యవసాయం, విద్య, ఆరోగ్య రంగాల్లో తెలంగాణ కోసం డిజిటలైజేషన్ ఎజెండాను అభివృద్ధి చేయడంలో రాష్ట్రంతో భాగస్వామిగా ఉండేందుకు గూగుల్ సంతోషం వ్యక్తం చేస్తోందని తెలిపారు.
తెలంగాణ పౌరుల అవసరాలను తీర్చేందుకు నాణ్యమైన సేవలను అందించడానికి విస్తృత సాంకేతికత, నైపుణ్యం తమ వద్ద ఉందని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి రంగాన్ని ప్రభావితం చేస్తుందని అన్నారు. సంస్థ పెట్టుబడి ప్రణాళికలపై ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డితో ఆయన చర్చించారు.
గూగుల్ మ్యాప్స్, గూగుల్ ఎర్త్ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించి సాధ్యమయ్యే రహదారి భద్రత గురించి ఇరువురు చర్చించినట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇతరులు పాల్గన్నారు..