Telugu News » Hanumakonda : మాకు గుర్తింపు ఇవ్వని పార్టీలకు బుద్ధి చెప్తాం

Hanumakonda : మాకు గుర్తింపు ఇవ్వని పార్టీలకు బుద్ధి చెప్తాం

హనుమకొండలో నిర్వహించే ఈ గౌడ గర్జనకు సంబంధించిన వివరాలను మీడియాకు తెలియ చేశారు. ఇప్పటీ వరకు గౌడలు తమ హక్కులను విన్నవించుకున్నారని, దీంతో ఏ రాజకీయ పార్టీ పట్టించుకోలేదని, ఇకపై పోరాటబాట పడతామని...అందుకు ఈ గౌడ గర్జనే ప్రారంభమని యాదగిరి గౌడ్ అన్నారు.

by Prasanna
Gita Karmikulu

గీత కార్మికుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అక్టోబర్ 1 న గౌడ గర్జన (Gouda Garjana) నిర్వహిస్తున్నట్లు తెలంగాణ (Telangana) గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొనగాని యాదగిరి గౌడ్ (Bonagani Yadagiri Goud) తెలిపారు. దీనిని హనుమకొండ ఆర్ట్స్ & సైన్స్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వాలు ఎన్ని మారిన గౌడల తలరాతలు మారలేదని యాదగిరి గౌడ్ అన్నారు.

Gita Karmikulu

హనుమకొండలో నిర్వహించే ఈ గౌడ గర్జనకు సంబంధించిన వివరాలను మీడియాకు తెలియ చేశారు. ఇప్పటీ వరకు గౌడలు తమ హక్కులను విన్నవించుకున్నారని, దీంతో ఏ రాజకీయ పార్టీ పట్టించుకోలేదని, ఇకపై పోరాటబాట పడతామని…అందుకు ఈ గౌడ గర్జనే ప్రారంభమని యాదగిరి గౌడ్ అన్నారు. తాము తమ హక్కుల కోసం అడుక్కోవడం లేదని, అలా చేస్తే ఇచ్చే వాళ్లు బిచ్చం వేసినట్లు భావిస్తారని, అందుకే పోరాటం చేసి రాజ్యాధికారం సాధించుకుంటామని చెప్పారు.

గౌడ కులస్థులకు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని, గౌడలకు రాజ్యాధికారం కల్పించే విషయంలో అసలు పట్టించుకోవడం లేదన్నారు. పోరాడితే వచ్చేది రాజ్యాధికారం అనే నినాదంతోనే గౌడల పోరాటం భవిష్యత్తులో ఉంటుంది తెలియ చేశారు.

గీత కార్మికులకు ప్రస్తుత ప్రభుత్వం చేసిందేమీ లేదని, తాటి చెట్లు మీద నుంచి పడిపోతే వచ్చే భీమా తప్ప, కేసీఆర్ ప్రభుత్వం తమకే విధంగాను సహాయపడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయంగా కేసీఆర్ కోసం గౌడులు అనేక త్యాగాలు చేశారని, అయినా తమని పట్టించుకోలేదని తెలిపారు.

గీత కార్మికులకు రక్షణ పరికరాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అర్థం లేని నిబంధనలు లేకుండ ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, అలాగే గీత కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన అన్నీ హీమీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. గౌడ కులస్థులకు సీట్ల కేటాయింపులోనూ తగిన స్థానం కల్పించాలన్నారు. గౌడలకు తగిన గుర్తింపు ఇవ్వని ఏ పార్టీకైనా బుద్ధి చెప్తామని హెచ్చరించారు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

You may also like

Leave a Comment